మోయలేని భారం మోపేవాడే మోడీ: మహిళల వంటింటినుండే బీజేపీ పతనం షురూ: మంత్రి కేటీఆర్

కేంద్రంలోని అధికార బీజేపీని పదేపదే టార్గెట్ చేసే తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా మరోమారు ట్విట్టర్ వేదికగా బిజెపి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల నిత్యావసరమైన గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెంచి, సామాన్యులపై పెను భారం మోపుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఆదాయాలు పాతాళంలో, ధరలు ఆకాశంలో ఉంటాయంటూ తనదైన శైలిలో టార్గెట్ చేశారు.

బీజేపీ పతనం మహిళల వంటింటి నుండే షురూ

బీజేపీ పతనం మహిళల వంటింటి నుండే షురూ

రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంలోని అధికార బీజేపీ ని టార్గెట్ చేసి పేద మధ్యతరగతి మహిళలవంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ అవుతుందని తేల్చి చెప్పారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తారు, కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా? అంటూ ప్రశ్నించారు. రూ.400 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1100 (NOT-OUT) అయినా ఇంకా పెరుగుతూనే ఉందన్నారు. ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేస్తూ, ఆడపిల్లలపై పెను భారం మోపుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

పేదవాడి పొట్ట కొట్టడం, మళ్లీ వాళ్ల చేతిలో పొగగొట్టం పెట్టటం.. బీజేపీ చేసేదిదే

పేదవాడి పొట్ట కొట్టడం, మళ్లీ వాళ్ల చేతిలో పొగగొట్టం పెట్టటం.. బీజేపీ చేసేదిదే

గ్యాస్ ధర వెయ్యి అయ్యింది, పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యింది అంటూ కేంద్ర ప్రభుత్వ తీరును టార్గెట్ చేసిన కేటీఆర్ పేదవాడి పొట్ట కొట్టడం, మళ్లీ వాళ్ల చేతిలో పొగగొట్టం పెట్టడమే అంటూ నిప్పులు చెరిగారు. సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి, ఇప్పుడు 3 సిలిండర్లజపం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు సిలిండర్లతోమూడుపూటలా వంట సాధ్యమా అని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ మోయలేని భారం మోపే వాడే మోడీ అని మహిళాలోకానికి అర్థమైంది అంటూ తేల్చి చెప్పారు.

ఆయిల్ కంపెనీలకు కాసుల పంట.. కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట

ఆయిల్ కంపెనీలకు కాసుల పంట.. కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట

మోడీ పాలనలో ఆయిల్ కంపెనీలకు కాసుల పంట పండుతుందని, కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట మండుతుంది అని నిప్పులు చెరిగారు. ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవు అంటూ ప్రశ్నించిన మంత్రి కేటీఆర్, మోడీ పాలనలో ధరలు ఆకాశంలో ఉన్నాయని, ఆదాయాలు మాత్రం అందుకోలేనంత పాతాళంలో ఉన్నాయని పేర్కొన్నారు. గరీబోళ్ల గుండెలపై గ్యాస్ బండలు గుదిబండలుగా మారుతున్నాయని కేటీఆర్ తెలిపారు. అందుకే పేద, మధ్య తరగతి మహిళల వంటింట్లో నుండి బీజేపీ పతనం షురూ అవుతుందంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+