పోలీస్ స్పెల్లింగ్ అడిగిన మంత్రి మల్లారెడ్డి; చదువురాని మంత్రులను ఆడేసుకుంటున్న బీజేపీ!!
మంత్రి చామకూర మల్లారెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ఈయన పేరు చెప్తే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. పాలమ్మినా.. పూలమ్మినా.. బోర్వెల్ నడిపినా.. కష్టపడి పైకొచ్చినా అని మంత్రి మల్లారెడ్డి చెప్పే డైలాగ్లు ఎంత ఫేమస్ నో అందరికీ తెలుసు. మల్లారెడ్డి ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఒక సంచలనమే. ఇక ఆయన స్పీచ్ లు అయితే ఎవరు ఊహించని విధంగా ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
తాజాగా మంత్రి మల్లారెడ్డి ఓ కార్యక్రమంలో పోలీసు స్పెల్లింగ్ అడగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని జీనోమ్ వ్యాలీలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడ రిజిస్టర్ బుక్ లో పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ సంబంధించి వివరాలు రాయవలసిన చోట, పెన్ను తీసుకున్న మంత్రి మల్లారెడ్డి ఏమి రాయాలని అక్కడి పోలీసులు అడిగారు.

ఈరోజు డేట్ వేసి పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ అని రాయాల్సిందిగా పోలీసులు సూచించారు. అయితే పోలీస్ స్పెల్లింగ్ ఏమిటని మంత్రి మల్లారెడ్డి అక్కడ పోలీస్ లను ప్రశ్నించారు. అక్కడే ఉన్న పోలీసులు, ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆయన సరదాగా అడిగారా లేక నిజంగానే తెలియక అడిగారా అనేది అర్థం కాలేదు. మంత్రి అలా అడిగిన మీదట అక్కడే ఉన్న పోలీసులు పోలీస్ స్పెల్లింగ్ చెప్పారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రానికి మంత్రిగా ఉండి పోలీస్ స్పెల్లింగ్ కూడా రాని మంత్రి మల్లారెడ్డిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇట్లాంటి మంత్రులు మన రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రి మల్లారెడ్డి పోలీసు స్పెల్లింగ్ అడగడంతో బీజేపీ సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో చదువురాని మంత్రులు చాలా మంది ఉన్నారని బీజేపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ రానోడు మనకు మంత్రి, మన అదృష్టం కొద్దీ మల్లారెడ్డి ఒక్కడే కాదు సగంమంది మంత్రులకు చదువు రాదు అని విమర్శిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి,సత్యవతి రాథోడ్ వీళ్లంతా చదువురాని మంత్రులేనని విమర్శిస్తున్నారు. అయినా తప్పు వాళ్ళది కాదు, వాళ్లకు ఓటేసి గెలిపించిన మనదేనని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications