వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి మల్లారెడ్డి కొడుక్కి అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక; కొడుకును కొట్టించారని మల్లారెడ్డి సంచలన ఆరోపణ!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి నివాసాలు, ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలంగా మారింది. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ నిన్న ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక నేడు కూడా ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

మంత్రి మల్లారెడ్డి కొడుక్కి చాతీనోప్పి.. ఆస్పత్రిలో చేరిక

మంత్రి మల్లారెడ్డి కొడుక్కి చాతీనోప్పి.. ఆస్పత్రిలో చేరిక

ఈ క్రమంలో తాజాగా మంత్రి మల్లారెడ్డి కొడుకు అస్వస్థతకు గురయ్యారు. మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి ఛాతీ నొప్పి రావడంతో సూరారం లోని ఓ హాస్పిటల్లో ఆయనను చేర్పించారు. నిన్న మహేందర్ రెడ్డి నివాసంలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మహేందర్ రెడ్డి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలలో, పలు రియల్ ఎస్టేట్ సంస్థలలో డైరెక్టర్ గా ఉన్నారు. ఈ క్రమంలో కొంపల్లి లోని మహేందర్ రెడ్డి నివాసంలోనూ, ఆయన నిర్వహించిన సంస్థలలోనూ తనిఖీలు చేపట్టిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

కొడుకును చూడటానికి వెళ్ళిన మల్లారెడ్డి.. వేధించారని ఆగ్రహం

కొడుకును చూడటానికి వెళ్ళిన మల్లారెడ్డి.. వేధించారని ఆగ్రహం


దీంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆపై ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో మల్లారెడ్డి ఆసుపత్రికి కుమారుడిని చూడటానికి వెళ్ళాడు. ఈ క్రమంలో సూరారంలోని ఆసుపత్రి వద్ద మంత్రి మల్లారెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐటీ రైడ్స్ రాజకీయ కక్ష అని ఆయన తీవ్రంగా విమర్శించారు. తన కొడుకుని వారు తీవ్రంగా భయపెట్టారని, వారు తన కుమారుడిని కొట్టి ఉంటారని మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

తాను దొంగ వ్యాపారాలు చెయ్యటం లేదన్న మంత్రి మల్లారెడ్డి

తాను దొంగ వ్యాపారాలు చెయ్యటం లేదన్న మంత్రి మల్లారెడ్డి

బిజెపి రాజకీయ కక్షతో తనపై, తన బంధువుల పై ఐటీ దాడులు చేయిస్తోందని, తన కొడుకును వేధింపులకు గురి చేయడంతోనే అతను ఆస్పత్రి పాలయ్యాడు అని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. కావాలని తమపై ఐటీ దాడులు చేస్తున్నారని, రెండువందల మంది ఐటీ అధికారులతో తమపై దాడులు చేయించి భయ పెడతారా అంటూ మంత్రి మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి దొంగ వ్యాపారాలు చేయడం లేదని, క్యాసినో లు నడపడం లేదని, కాలేజీలు పెట్టి సేవ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక కొడుకును చూడడానికి మల్లారెడ్డి ఆసుపత్రికి వెళ్లిన క్రమంలో ఆయనతోపాటు ఐటి అధికారులు కూడా ఉన్నారు.

English summary
Minister Mallar Reddy's son Mahender Reddy fell ill and was admitted to the hospital. A minister who went to the hospital to see his son made a sensational allegation of molesting his son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X