అధికారులకు టార్గెట్, కేసీఆర్‌కు నివేదిక (ఫోటోలు)
హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) నుంచి మూడోదశ పైప్‌లైన్ ద్వారా మార్చి నాటికి హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించనున్నట్లు ఎక్సైజ్ మంత్రి పద్మారావు పేర్కొన్నారు.
హైదరాబాద్-సాగర్ హైవేపై 106 కిలోమీటర్ల మేర జరుగుతున్న కృష్ణా జలాల మూడో దశ పైప్‌లైన్ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని గున్‌గల్, ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ, కోదండాపురం మెట్రోవాటర్ ప్లాంట్, గొడుకొండ్ల, నసర్లపల్లి రిజర్వాయర్లను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ జంట నగరాల్లో జనాభా రెండు కోట్లకు సమీపిస్తుండటంతో భవిష్యత్తులో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నదన్నారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా రోజూ 540 ఎంజీడీల నీటి సరఫరా అవసరమని, 340 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేస్తున్నామన్నారు.

కృష్ణా మూడోదశ పనులను పరిశీలించిన మంత్రి పద్మారావు
నల్గొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) నుంచి మూడోదశ పైప్‌లైన్ ద్వారా మార్చి నాటికి హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించనున్నట్లు ఎక్సైజ్ మంత్రి పద్మారావు పేర్కొన్నారు.

కృష్ణా మూడోదశ పనులను పరిశీలించిన మంత్రి పద్మారావు
హైదరాబాద్-సాగర్ హైవేపై 106 కిలోమీటర్ల మేర జరుగుతున్న కృష్ణా జలాల మూడో దశ పైప్‌లైన్ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని గున్‌గల్, ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ, కోదండాపురం మెట్రోవాటర్ ప్లాంట్, గొడుకొండ్ల, నసర్లపల్లి రిజర్వాయర్లను పరిశీలించారు.

కృష్ణా మూడోదశ పనులను పరిశీలించిన మంత్రి పద్మారావు
అనంతరం మాట్లాడుతూ జంట నగరాల్లో జనాభా రెండు కోట్లకు సమీపిస్తుండటంతో భవిష్యత్తులో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నదన్నారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా రోజూ 540 ఎంజీడీల నీటి సరఫరా అవసరమని, 340 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేస్తున్నామన్నారు.

కృష్ణా మూడోదశ పనులను పరిశీలించిన మంత్రి పద్మారావు
మార్చి నుంచి 90 ఎంజీడీలను పూర్తిగా తరలించే ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌తో ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గోదావరి మొదటి దశ జలాల తరలింపుపై దృష్టి సారించి జూన్, జూలై నాటికి తొలి దశ పనులను పూర్తి చేసి రోజూ 172 ఎంజీడీలను నగరానికి సరఫరా చేస్తామన్నారు.

అవసరమైతే సుంకిశాల నుంచి రూ.840 కోట్ల వ్యయంతో కృష్ణానాలుగో దశ పైప్‌లైన్ చేపట్టే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. అప్పుడు సాగర్‌లో డెడ్‌స్టోరేజీలో నీరున్నప్పటికీ తాగునీరు అందించవచ్చన్నారు.
కృష్ణా మూడోదశ పనులను పరిశీలించిన మంత్రి పద్మారావు
మూడో దశ పనులను డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని అధికారులకు టార్గెట్ పెట్టామని, పథకంపై పూర్తిస్థాయి నివేదికను సీఎంకు అందజేస్తామన్నారు.
నీటి కొరతను అధిగమించేందుకే గోదావరి, కృష్ణామూడో దశ పనులను వేగవంతం చేసినట్లు చెప్పారు. నిత్యం 90 ఎం జీడీలను తరలించే కృష్ణా మూడోదశ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, డిసెంబర్ చివరినాటికి రెండు పంపులు నడిపించి తొలిదశ కింద రోజూ 22.5 ఎంజీడీలు సరఫరా చేస్తామన్నారు.
మార్చి నుంచి 90 ఎంజీడీలను పూర్తిగా తరలించే ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌తో ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గోదావరి మొదటి దశ జలాల తరలింపుపై దృష్టి సారించి జూన్, జూలై నాటికి తొలి దశ పనులను పూర్తి చేసి రోజూ 172 ఎంజీడీలను నగరానికి సరఫరా చేస్తామన్నారు.
అవసరమైతే సుంకిశాల నుంచి రూ.840 కోట్ల వ్యయంతో కృష్ణానాలుగో దశ పైప్‌లైన్ చేపట్టే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. అప్పుడు సాగర్‌లో డెడ్‌స్టోరేజీలో నీరున్నప్పటికీ తాగునీరు అందించవచ్చన్నారు. మూడో దశ పనులను డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని అధికారులకు టార్గెట్ పెట్టామని, పథకంపై పూర్తిస్థాయి నివేదికను సీఎంకు అందజేస్తామన్నారు.

Click it and Unblock the Notifications