కాంగ్రెస్ 6గ్యారెంటీలలో మిగతావి అమలు అప్పుడే: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!!
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ లను తప్పక అమలు చేస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే గెలిచిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ఇచ్చిన మాట మేరకు పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత వంద రోజుల్లోనే అమలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఖమ్మం కలెక్టరేట్లో పాలేరు నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లలో రెండు గ్యారెంటీల అమలు జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మరో రెండు గ్యారంటీలు అమలు డిసెంబర్ 28వ తేదీన జరుగుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మిగిలిన రెండు గ్యారెంటీ లను సంక్రాంతి నాటికి తీసుకువస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం, ప్రజలకు అధికార యంత్రాంగం వారధిగా ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందే విధంగా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. ఈనెల 20వ తేదీన ప్రజల ముందు శ్వేతపత్రం ఉంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
అధికారులు ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా నత్తనడక నడుస్తున్న సీతారామ పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్టు పనులు, భూసేకరణ సమస్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. అలాగే పాలేరు జలాశయం నుంచి యాసంగి సాగుకు నీటి విడుదల, తాగునీటి సమస్యపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వీపి గౌతం, అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications