కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ నిరుపేదలకు భారీ శుభవార్త
కొత్త సంవత్సరంలోకి కాలు పెడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకు నిజమైన భద్రత లభిస్తుందని పేర్కొన్న ఆయన ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఒక సభలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన గుడ్ న్యూస్ చెప్పారు.
ప్రతీ నియోజకవర్గానికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళు
సొంతిల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చిన మంత్రి రాష్ట్రంలో నిరాశ్రయులైన పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడత ఇళ్ల మంజూరు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. అలాగే రాబోయే ఏప్రిల్ నెలలో ప్రతి నియోజకవర్గానికి రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ళు ప్రభుత్వం కేటాయించనుందని గుడ్ న్యూస్ తెలిపారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ళు
ఏప్రిల్ నెలలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ళు కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ పేదల ఆత్మ గౌరవాన్ని కాపాడే ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం వెనకడుగు వెయ్యలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు వచ్చేలా అధికార యంత్రాంగం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.
నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న సర్కార్
ఇల్లు విషయమే కాకుండా, పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతుందని మంత్రి వివరించారు, నిరుపేదలు నాణ్యమైన ఆహారాన్ని పొందడానికి రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. కోట్లాదిమంది సామాన్య ప్రజలకు ఈ కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
రాష్ట్రంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు
ఇప్పటికే రాష్ట్రంలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పిన ఆయన గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాలు నిరుపేద కుటుంబాలకు నెలవారీ ఖర్చులను బాగా తగ్గిస్తున్నాయి అని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు.
గతానికి భిన్నంగా సంక్షేమం
ఇక విద్యార్థుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుందని, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు కావలసిన అన్ని సామాగ్రిని అందజేయడం విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకుంటుంది అని మంత్రి పొంగులేటి అన్నారు. గతానికి భిన్నంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో రాజకీయ జోక్యం లేకుండానే పథకాలు
గత ప్రభుత్వ హయంలో లబ్ధిదారులు ఎంపికలో రాజకీయ జోక్యం అధికంగా ఉండేదని కానీ ప్రస్తుతం అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ క్రమంలోని మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని కొత్త సంవత్సరంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తామని ఆయన తెలిపారు.
-
పులుల గర్జనతో గ్రీన్ తెలంగాణ! నల్లమల అడవుల్లో అరుదైన రికార్డ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
తెలంగాణాకు కొత్త టెన్షన్.. క్యాన్సర్ కేసులపై ఐసీఎంఆర్ షాకింగ్ నివేదిక! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications