ఉచిత బస్సు ప్రయాణం లో కీలక మార్పు, ఇక ఆ కష్టాలకు చెక్..!!
ఉచిత బస్సు పథకం పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మీ పథకం కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సమయంలో కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటి వరకు మహాలక్ష్మీ పథకం ద్వారా రూ 10 వేల కోట్లు మహిళలకు లబ్ది జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, ఈ పథకం అమలులో గుర్తించిన సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పథకం లబ్ది దారుల కోసం కొత్త విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం ఇప్పటి వరకు రూ 10 వేల కోట్ల మేర మహిళలకు లబ్ది చేకూర్చినట్లు TGSRTC అధికారికంగా ప్రకటన చేసింది. 2023 డిసెంబర్ 9న పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. కాగా, 2026, మార్చి 29 నాటికి 290 కోట్లకు పైగా జీరో టికెట్లను మహిళలకు జారీ చేశారు. దీంతో ఈ పథకం కోసం రూ. 10,000 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అదే విధంగా ఈ పథకం ఆదరణ భారీగా పెరుగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. గతంలో 40 శాతంగా ఉండగా.. ఇప్పుడు 67 శాతానికి చేరింది. ప్రతిరోజూ సగటున 35 లక్షల మందికిపైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తుండగా.. వీటి టిక్కెట్ల విలువను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రూపంలో ఆర్టీసీకి చెల్లిస్తోంది. దీని వల్ల ఆర్టీసీకి కూడా ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అమలుకు సిద్దమైంది.

లబ్దిదారులకు ఆధార్ అవసరం లేకుండా స్మార్ట్ కార్డులు
మహాలక్ష్మీ పథకం అమలు కోసం ఇప్పటి వరకు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ ద్వారా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఆధార్ కార్డుల్లో ఉన్న సాంకేతిక.. ముద్రణ సమస్యలు.. అందులో చూపిస్తున్న ప్రాంతాలతో కొందరు మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణం సమయంలో వారి అనుమతి కండెక్టర్లకు సమస్యగా మారుతోంది. ఇదే అంశం పైన పలు ప్రాంతాల్లో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో.. మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ కార్డులు ద్వారా మహిళల ఉచిత ప్రయాణం చేసేందుకు ఇక నుంచి ఆధార్ తో అవసరం లేకుండానే ఈ కార్డుల ద్వారా కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక.. పెరుగుతున్న ప్రయాణీకులకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.












Click it and Unblock the Notifications