నీటి పరిరక్షనే భావితరాలకు ఇచ్చే కానుక.!ప్రజలకు జల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి.!
హైదరాబాద్ : ప్రకృతి వరంగా భావించే నీటిని పరిరక్షించడం మనం భావితరాలకు ఇచ్చే అమూల్యమైన కానుక అని ఈ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఉద్ఘాటించారు. జల దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
నీళ్ళు, నిధులు, నియామకాల నినాదంలో నీళ్ళే ప్రధానంగా భావించిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ఉద్యమం నడిపి, స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేసారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేందుకు ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టి, అద్భుతమైన మానవ నిర్మిత కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలాలను అడుగంటకుండా చర్యలు తీసుకున్న తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ను సత్యవతి రాథోడ్ అభినందించారు.
మనిషికి వచ్చే జబ్బుల్లో ఎక్కువగా నీటి కాలుష్యమే కారణమని గుర్తించి, తెలంగాణ ప్రజలు వ్యాధుల బారిన పడి కుటుంబాలను అధోగతి పాలు చేసుకోవద్దనే గొప్ప సంకల్పంతో, తెలంగాణ ఆడబిడ్డలు తాగునీరు కోసం బిందెలు పట్టుకొని కిలోమీటర్ల మేర నడవడం అభివృద్ధికి అవమానమని భావించి, ఇంటింటికి మంచి నీటిని ఇవ్వడానికి మిషన్ భగీరథ పూర్తి చేసి దేశంలోనే రోల్ మోడల్ గా మన రాష్ట్రాన్ని నిలిపిన అపర భగీరథుడు సీఎం చంద్రశేఖర్ రావు అని అన్నారు. ఇంతటి ముఖ్యమైన ఈ నీటి విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి పరిరక్షణకు పునరంకితం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.












Click it and Unblock the Notifications