తెలంగాణ తరఫున సానుభూతి: శ్రీదేవి మృతిపై తెలంగాణ మంత్రి తలసాని
హైదరాబాద్: నటి శ్రీదేవి లేని లోటు తీర్చలేనిదని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం అన్నారు. శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్లో శనివారం అర్ధరాత్రి సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
దీనిపై తలసాని స్పందించారు. శ్రీదేవిలోటు బాధాకరమని, వారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు.

శ్రీదేవి మరణ వార్త విని షాకయ్యానని, చాలా విచారంగా ఉందని, ఆమె అద్భుతమైన మహిళ అని, ఎప్పటికీ తన అభిమాన నటి అని, ఆమె కుటుంబానికి, శ్రేయోభిలాషులకు తట్టుకునే బలం ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నానని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నటుడు మహేష్ బాబు అన్నారు.












Click it and Unblock the Notifications