రైతుబంధు, రుణమాఫీ అమలు - రేవంత్ సర్కార్ తాజా ప్రకటన..!!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవటమే లక్ష్యంగా రేవంత్ అడుగులు వేస్తున్నారు. గ్యారంటీల అమలు నిర్ణయాలు వేగంగా తీసుకున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతు రుణమాఫీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో ఈ విషయం పైన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టత ఇచ్చారు. అమలు పైన క్లారిటీ ఇచ్చారు.
రుణమాఫీ పై నిర్ణయం
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు రుణ మాఫీ పై అమలు ఇచ్చింది. రుణ మాఫీ అమలు పైన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఈ సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ఆర్‌బీఐ, బ్యాంకులతో కలిసి విధివిధానాల రూపకల్పన చేస్తున్నామని వెల్లడించారు. గతంలోనే సీఎం రేవంత్ దీని పైన క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణ సేకరణ చేసి రైతులకు ముందుగా రుణమాఫీ అమలు చేసి..ఆ తరువాత కార్పోరేషన్ ద్వారా బ్యాంకుకు తిరిగి చెల్లింపు చేస్తామని వివరించారు.

విధి విధానాలపై కసరత్తు
ఇప్పుడు ఈ ప్రక్రియ అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో...ఎన్నికల తరువాత ఈ గైడ్ లైన్స్ ను అధికారికంగా ప్రకటన చేస్తామని స్పష్టం చేసారు.2023-24 యాసంగికి సంబంధించి శుక్రవారం నాటికి 64,75,819 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటి వరకు 92.68శాతం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యాయన్నారు. అయితే.. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఏడాది కూడా రైతుబంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజుల్లో వేయలేదని మంత్రి వివరించారు. 2018-19 వానాకాలంలో 4 నెలల 5 రోజుల్లో వేస్తే.. అదే ఏడాది యాసంగిలో 5 నెలల 11 రోజులు పట్టిందని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ కు కలిసొచ్చేనా
ఇక..ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. పెండింగ్ స్థానాలకు అభ్యర్దులను ప్రకటించి ప్రచారం ప్రారంభించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా రైతుబంధు, రైత రుణమాఫీ పైన క్లారిటీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత గ్యారంటీలను అమలు చేస్తూనే...రాజకీయంగా బీఆర్ఎస్ ను రేవంత్ టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలవటం ఇప్పుడు రేవంత్ కు వ్యక్తిగత ప్రతిష్ఠాత్మక అంశంగా మారింది. తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల రాజకీయంగా మరింతగా ఆసక్తిని పెంచుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications