రైతు భరోసా నిధుల జమపై ప్రభుత్వం కీలక ప్రకటన..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా అమలులో ఇక మార్పు జరగనుంది. అదే విధంగా రైతులకు సంబంధించి మరో పథకం దిశగా కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుభరోసా అమలు పైన సుదీర్ఘ కసరత్తు చేసారు. అసెంబ్లీ వేదికగా నిర్ణయం వెల్లడించారు. కాగా, ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రైతు భరోసా నిధుల విడుదల.. నిబంధనల పైన స్పష్టత ఇచ్చారు.
రైతు భరోసా పథకం పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి సాగు చేస్తున్న పంట భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తేల్చి చెప్పారు. ఈ మేరకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

శాటిలైట్ ఫొటోల క్రీడకరణ పూర్తి చేసి నివేదికను వెంటనే సమర్పించాలని సూచించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతనే రైతు భరోసా నిధులు జమ చేయున్నట్లు తెలిపారు. యాసంగిలో పంట పండి స్తున్న భూములను శాటిలైట్ ద్వారా గుర్తించే ప్రక్రియ ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీంతో రాబోయే రైతు భరోసా డబ్బులు పంట పండిస్తున్న భూములకు మాత్రమే జమ చేయాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. కాగా, సాగులో లేని భూములకు రైతు భరోసా అదే అవకాశం లేదు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో పంట సాగు చేయని 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని గతంలో రేవంత్ పలుమార్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లు గతంలో సాగు భూములకే మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేశారు. సాగుకు పనికిరాని భూములను గుర్తించి వారికి రైతు భరోసా బంద్ చేశారు.
దీని వల్ల ప్రభుత్వానికి అర్ధిక భారం తగ్గడంతో పాటు అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా అందనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందిస్తోంది. గతంలో ఎకరానికి రూ.5 వేలు ఇచ్చేవారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. కాగా, వచ్చే ఏడాది జనవరిలో రైతుల కోసం మరో కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లు తుమ్మల వెల్లడించారు.












Click it and Unblock the Notifications