Farmers: రైతులకు శుభవార్త.. రెండు రోజుల్లో పంటనష్ట పరిహారం..!
తెలంగాణలో మార్చిలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు ఆదుకునేందుకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించాలని అప్పుడే నిర్ణయించింది. వ్యవసాయ అధికారుల ద్వారా పంట నష్టాన్ని అంచనా వేసింది. తాజాగా పంట నష్ట పరిహారంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు.
పంట నష్ట పరిహారం ఒకటి, రెండు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి 24 మధ్య రాష్ట్రంలోని పది జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. దీంతో పంట దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసింది.

ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల చొప్పున రూ.15.81 కోట్లను పరిహారం కింద రైతులకు చెల్లించడానికి ఏర్పాట్లు చేసినట్లు తమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పరిహారం రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరింది.
రైతులను దృష్టిలో ఉంచుకుని పంట నష్ట పరిహారం బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం పంట నష్ట పరిహారం విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది. మంగళ, బుధ వారాల్లో పంట నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications