వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ దొంగల పార్టీ; చేసేది ప్రభుత్వాలను కూల్చే పని: భగ్గుమన్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి!!

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ తీరుపై తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ పార్టీ దొంగల పార్టీ అని పేర్కొన్న మంత్రులు బిజెపి ప్రభుత్వాలను కూల్చే పని పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగాన్ని, ప్రజలను మోసం చేసే పార్టీ బీజేపీ అని పేర్కొన్న మంత్రులు, కేంద్రం తెలంగాణపై కక్ష కట్టింది అన్నారు. కేంద్ర మంత్రులు అబద్ధాలు మాట్లాడుతున్నారని, తెలంగాణ సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

దేశానికే కేసీఆర్ పథకాలు ఆదర్శం

దేశానికే కేసీఆర్ పథకాలు ఆదర్శం


రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆడబిడ్డకు మేనమామ గా కళ్యాణాలక్ష్మి పథకం తీసుకువచ్చి, ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా ఉంటున్నారని మంత్రులు పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయిదు వందల పెన్షన్ కూడా రావడం లేదని మంత్రులు ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ కొనియాడారు.

రైతులు పండించిన ప్రతీ గింజ కొంటుంది తెలంగాణా ప్రభుత్వమే

రైతులు పండించిన ప్రతీ గింజ కొంటుంది తెలంగాణా ప్రభుత్వమే

కాళేశ్వరం ప్రాజెక్టు తో ప్రతి ఎకరాకు నీరందించిన మహాత్ముడు అన్నారు. సాగు నీరు, మంచినీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు పంటలు బాగా పండి, దిగుబడి పెరగడానికి కారణం అయ్యాయని, వాటిని అందించింది కేసీఆర్ అన్నారు.

రైతులు పండించిన ప్రతి గింజను మన ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి ప్రతి ఏటా 3 వేల కోట్లు నష్టం వచ్చినా భరిస్తూ, సీఎం కెసిఆర్ కొనుగోలు చేస్తున్నారన్నారు. లట్టుంగాడు, పొట్టుంగాడు వచ్చి వరి వేయమని చెప్పి తీరా సమయానికి చేతులు ఎత్తేశారన్నారు. చేసేది లేక మళ్ళీ మన సీఎం కెసిఆర్ రైతులు నష్ట పోవద్దని ధాన్యం కొంటున్నాడన్నారు.

రైతుల కోసం మీటర్లు వద్దన్న కేసీఆర్

రైతుల కోసం మీటర్లు వద్దన్న కేసీఆర్


దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, పక్క రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయన్నారు. పక్క రాష్ట్రాల రైతులు తెలంగాణలో ఎందుకు పుట్టలేదని బాధ పడుతున్నారని మంత్రులు వ్యాఖ్యానించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర చేసింది కానీ తన బొందిలో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టనివ్వనని కెసిఆర్ చెప్పారన్నారు. రైతులు లాభపడాలని ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ పని చేశారన్నారు.

ఎవరైనా ధాన్యం కొనుగోలు విషయంలో రెచ్చగొడితే రెచ్చిపోకండి

ఎవరైనా ధాన్యం కొనుగోలు విషయంలో రెచ్చగొడితే రెచ్చిపోకండి

రైతులు, బాగా డిమాండ్ ఉండే ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. టోకెన్లు ఇచ్చి పద్ధతి ప్రకారం ధాన్యం కొంటామని, తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యపు చివరి గింజ వరకు కొంటామని, ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోవద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సూచించారు.

ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తున్నారు: మళ్ళీ విరుచుకుపడిన ప్రకాష్ రాజ్!!ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తున్నారు: మళ్ళీ విరుచుకుపడిన ప్రకాష్ రాజ్!!

English summary
Ministers Errabelli Dayakar Rao and Satyavati Rathore, who called the BJP a party of thieves, said that what the BJP is doing is the work of bringing down governments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X