వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చదివేది ఎనిమిది కానీ వీడు మహా ముదురు: అమ్మాయిలు స్నానం చేస్తుంటే...?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : స్కూళ్లో చదువుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు కొనివ్వడంవల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఇంకా మేజర్లుగా కూడా ఎదగని అబ్బాయిలు మొబైల్ ఫోన్లతో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మాదాపూర్‌లో చోటుచేసుకుంది. హాస్టల్స్‌లో ఉంటున్న అమ్మాయిల వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందుతున్న ఓ బాలుడి నిర్వాకం ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లో వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇతర కంపెనీలు ఉండటంతో చాలామంది యువతులు మాదాపూర్ హాస్టళ్లలో ఉంటూ తమ కార్యాలయాలకు వెళ్లి వస్తుంటారు. అమ్మాయిలకు రక్షణగా నిలుస్తాయనుకుంటున్న హాస్టళ్లకు భద్రత లేకుండా పోయింది. ఎనిమిదవ తరగతి చదివే కుర్రాడు తన మొబైల్ ఫోన్లతో హాస్టల్‌లో ఉండే అమ్మాయిల నగ్న దృశ్యాలను రికార్డు చేశారు. అమ్మాయిలు స్నానాలు చేసేందుకు వాష్ రూంకు వెళ్లిన సమయంలో హాస్టల్ పక్క బిల్డింగ్‌లో ఉండే ఆ కుర్రాడు వీడియో తీసేవాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా 30 మంది యువతుల నగ్న దృశ్యాలను తన మొబైల్ ఫోన్ వినియోగించి రికార్డు చేశాడు.

Minor Boy arrested by madhapur police for filming women while taking bath

ఇక ఒకరోజు ఈ కుర్రాడి పాపం పండింది. రోజులానే మరో అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో రికార్డ్ చేసేందుకు సిద్దమయ్యాడు. లైటింగ్ సరిగ్గా లేనందున మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి దొరికిపోయాడు. ఫ్లాష్ లైట్‌ను గమనించిన అమ్మాయి జరిగిన విషయం బయటపెట్టింది. వెంటనే అమ్మాయిలు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాలుడిని పట్టుకున్న పోలీసులు వీడియోలు తన దగ్గరే ఉంచుకున్నాడా లేక ఇతరులకు ఏమైనా పోస్ట్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వడంతో అందులో అశ్లీల చిత్రాలు చూసి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

English summary
A eighth standard boy was caught filming the ladies who were taking bath in a working womens hostel in Hyderabad's madhapur area. The police is questioning the boy whether the videos were forwarded to anybody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X