నెలల తరబడి కూతురిపై తండ్రి అత్యాచారం: పరారీ
మహబూబ్‌నగర్: ఓ బాలిక పాలిట కన్నతండ్రే కీచకుడిగా మారి చెరబట్టాడు. ఏడో తరగతి చదువుతున్న అమ్మాయిపై తండ్రి కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఆ బాలికకు పోలీసులు గురువారంనాడు విముక్తి కలిగించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం గ్రామంలో చోటు చేసుకుంది.
తాను అనుభవిస్తున్న నరకాన్ని బాలిక తన పాఠశాల టీచర్‌కు చెప్పింది. సమాచరాం అందుకున్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ పోలీసుల సహాయంతో ఆమెను రక్షించింది. బాలికపై తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అతను పరారీలో ఉన్నాడు.
కేసు నమోదు చేసుకున్న బిజినేపల్లి పోలీసులు బాలికను మహబూబ్‌నగర్‌లోని బాలల సంక్షేమ గృహానికి పంపించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. రంగాపూర్, పెబ్బేర్ పోలీసు స్టేషన్లకు కూడా సమాచారం అందించి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తల్లి కూడా విషయం తెలుసునని, అయితే ఆ విషయాన్ని ప్రశ్నిస్తే అతను ఆమెను కొట్టేవాడని చెబుతున్నారు. బాధితురాలికి ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు నిందితుడి భార్య అతని వేధింపులు తట్టుకోలేక పాలెం వచ్చింది. తన పూర్వీకుల ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది.
అయితే, గత ఆరు నెలలుగా నిందితుడి ఇంటికి వస్తూ బాలికపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. నిందితుడు తమను నగ్నంగా చూడాలని బలవంతం చేసేవాడని తల్లితో పాటు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications