మిస్ వరల్డ్-2025 గ్రాండ్ ఫినాలేకు మిస్ ఇండియా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ - 2025 పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తోంది. 72వ ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో 110కి పైగా దేశాల నుంచి సుందరీమణులు విశ్వసుందరి కిరీటం కోసం పోటీపడ్డారు. అయితే శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో టాప్ మోడల్ ఛాలెంజ్ నిర్వహించారు. ఈ పోటీల్లో ఇండియన్ బ్యూటీ నందిని గుప్తా సత్తా చాటారు. నలుగురు ఖండాంతర విజేతలలో ఆమె ఒకరిగా నిలవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
యూరప్ నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్డ్ట్, ఆఫ్రికా నుంచి మిస్ నమీబియా సెల్మా కమాన్య.. అమెరికా అండ్ కరేబియన్ నుంచి మిస్ మార్టినిక్ ఆరేలీ జోచిమ్, ఆసియా అండ్ ఓషియానియా నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా విజేతలుగా నిలిచారు. దీంతో ఈ నలుగురు విజేతలు ఈ గ్రాండ్ ఫినాలేలో చోటు దక్కించుకున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. ఈనెల 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే పోటీ ఉండనుండగా.. ఫైనల్ రౌండ్‌లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది.

అయితే అంతకు ముందు ప్రతి ఖండం నుంచి ఇద్దరు ఫైనలిస్టులను షార్ట్‌లిస్ట్ చేశారు. ఆఫ్రికా నుంచి మిస్ కోట్ డి ఐవోయిర్ ఫటౌమాటా కౌలిబాలీ, మిస్ నమీబియా సెల్మా కమన్యా ఎంపికయ్యారు. అమెరికా అండ్ కరేబియన్‌కు నుంచి మిస్ మార్టినిక్ ఆరేలీ జోచిమ్, మిస్ వెనిజులా వలేరియా కన్నవో సెలక్ట్ అయ్యారు. ఆసియా అండ్ ఓషియానియా ఫైనలిస్టులలో మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ న్యూజిలాండ్ సమంతా పూలే ఉన్నారు. మిస్ బెల్జియం కరెన్ జాన్సెన్, మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్డ్ట్ యూరప్ నుంచి పోటీలో నిలిచారు. వీరిలో నుంచి నలుగురిని గ్రాండ్ ఫినాలేకు నిర్వహకులు ఎంపిక చేశారు.
ఇక ఈ పోటీల్లో గెలుపొందిన విజేతకి ఏకంగా ఒక మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తారని సమాచారం. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎనిమిది కోట్లు ప్రైజ్ మనీ రూపంలో దక్కుతుందని భావిస్తున్నారు. అలానే ప్రపంచ స్థాయి యాడ్స్, కార్పొరేట్ కంపెనీల యాడ్స్ రూపంలో భారీగా సంపాదించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మరోవైపు మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ ఆర్గనైజర్లు తనను వేశ్య లాగా చూశారంటూ.. మిస్ ఇంగ్లండ్ " మిల్లా మాగీ " అందాల పోటీల నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ మేరకు ఆమె పోటీల నుంచి తప్పుకున్న తర్వాత 'ది సన్' న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో కంటెస్టెంట్ ఇలా మధ్యలో వెళ్లిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications