డబ్బు మట్టి పాలు పథకం 'మిషన్ కాకతీయ': ఎన్జీఆర్ఐ నివేదిక, కేసీఆర్‌కు షాక్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మిషన్ కాకతీయ' పథకంపై నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్టీఆర్‌ఐ) ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదకలో టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా వందల కోట్ల రూపాయలను వృధాగా ఖర్చు చేస్తున్నారంటూ పేర్కొంది.
మిషన్ కాకతీయ పథకంలో టీఆర్ఎస్ ప్రభుత్వం శాస్త్రీయ విధానాన్ని పాటించడం లేదని అందువల్లే ఇలా జరుగుతోందని తన అభిప్రాయాన్ని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46,531 చెరువులను పునరుద్ధణలో భాగంగా ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ప్రాచీన కాలం నాటి చెరువుల పునరుద్ధరణలో భాగంగా వాటిని తవ్వేందుకు, పూడిక తీసేందుకు ఇలా ఈ పథకానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 20 వేల కోట్లు ఖర్చు పెడుతోంది. చెరువుల పునరుద్ధణ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న తాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్య కూడా తీరుతోందని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే ఈ పథకంలో ప్రభుత్వం శాస్త్రీయ విధానాన్ని పాటించడం లేదని ఎన్టీఆర్‌ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా చేయడం వల్ల భూమిలో నీటి స్థాయి ఎక్కవగా ఉన్న చోట కాకుండా నీటి స్థాయి తక్కువగా ఉండే ప్రాంతాల్లో మట్టిని తవ్వుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.
ఇలా చేయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండే ప్రమాదం ఉందని తెలిపారు. మిషన్ కాకతీయ పథకంపై ఎన్టీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ షకీల్ అహ్మాద్ మాట్లాడుతూ జనాభా పరంగా గానీ, వైశాల్యం పరంగా గానీ చూస్తే తెలంగాణ రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రామైన నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని అన్నారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ఎంతో బాగుందని కొనియాడారు. అయితే ఇందుకు ప్రభుత్వం శాస్త్రీయ విధానాన్ని పాటిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాల్లో గ్రానైట్, షేల్స్, సున్నపు రాయితో సహా హార్డ్ రాక్ నిర్మాణాలు ఉన్నాయని ఇలాంటి చోట నీటి నిల్వ తక్కువగా ఉండే అవకాశం ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications