వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు సీనియర్లకు రేవంత్ రెడ్డి ఎసరు: ఏం జరుగుతోంది?

తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చిచ్చు ఆ పార్టీ నుంచి కాంగ్రెసుకు మారింది. బహుశా, కాంగ్రెసులోని సీనియర్లు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఓటుకు నోటు కేసు చూపించి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చిచ్చు ఆ పార్టీ నుంచి కాంగ్రెసుకు మారింది. బహుశా, కాంగ్రెసులోని సీనియర్లు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఓటుకు నోటు కేసు చూపించి ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు కూడా సాగుతున్నట్లు వినికిడి.

అయితే, కాంగ్రెసు అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డిని తీసుకోవడానికి సిద్ధమైనట్లు అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి షరతులు ఏమీ పెట్టలేదని కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా మాటలను బట్టి నిర్ణయం జరిగిపోయినట్లు భావించవచ్చు.

రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెసు కండువా కప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆయన పార్టీలో చేరుతున్నారనే వార్త కాంగ్రెసులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో రేవంత్‌ రెడ్డి మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారనే సమాచారంతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టింది.

బుధవారం ఉదయం నుంచే కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఈ అంశంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. కొందరు ఢిల్లీలోని పెద్దలను సంప్రదించే ప్రయత్నం చేయగా, మరికొందరు రాష్ట్ర నేతలతోనే చర్చించారు. రేవంత్‌ పార్టీలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఆయన వల్ల పార్టీకి ప్రయోజనమా, పార్టీ వల్ల ఆయనకు ప్రయోజనమా? వస్తే ఆయనకు ఎలాంటి పదవులు ఇస్తారు వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇలా కొంత మంది....

ఇలా కొంత మంది....

రేవంత్ రెడ్డిని కాంగ్రెసులో చేర్చుకోవడాన్ని కొంత మంది నాయకులు స్వాగతిస్తున్నారు. మర్రి శశిధర్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి నాయకులు స్వాగతిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో రేవంత్‌ రెడ్డి పార్టీలోకి వస్తే ఎలాంటి నష్టం లేదని, పైగా టీఆర్‌ఎ్‌సను, సీఎం కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కోగలుగుతామనే ఉద్దేశంతో వారున్నారు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడమే ముఖ్యమని నాయకులు రేవంత్‌ రాకను స్వాగతిస్తున్నారు.

రేవంత్ రెడ్డి దూకుడు, వాగ్దాటి...

రేవంత్ రెడ్డి దూకుడు, వాగ్దాటి...

రేవంత్‌ రెడ్డి వాగ్ధాటి, దూకుడు పార్టీకి ఉపయోగపడుతుందని ఆయన రాకను స్వాగతిస్తున్న నాయకులు భావిస్తున్నారు. మరికొందరు నేతలు మాత్రం రేవంత్‌ రాక మంచిదేగానీ, ఆయనకు ప్రాముఖ్యమైన పదవులు ఇవ్వకూడదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మెజారిటీ నాయకులు మాత్రం అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటుని చెబుతున్నారు.

పీఠాలు కదులుతాయని భావించే వారు...

పీఠాలు కదులుతాయని భావించే వారు...


రేవంత్ రెడ్డి వస్తే మామూలుగా రాబోరని, ఏవో షరతులు పెట్టి ఉంటారని, అవి తమ పీఠాలను కదిలిస్తాయని భావిస్తున్న సీనియర్లు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెసులో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న నాయకులు దాదాపు డజను మంది ఉంటారు. వీరివల్లనే పార్టీ ముందుకు సాగడం లేదనే అభిప్రాయం కూడా ఉంది. వారిలో వారే పైస్థాయి కోసం విభేదించుకుంటూ పార్టీని ఎదకుండా చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. వారికి పార్టీ ముఖ్యం కాకుండా పోయిందని, వ్యక్తిగత ప్రతిష్టే ముఖ్యంగా మారిందని అంటున్నారు. వీరు రేవంత్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

అధిష్టానం ఇలా...

అధిష్టానం ఇలా...

అవసరమైతే రేవంత్ రెడ్డిని చేర్చుకుని సీనియర్లను వదులుకోవడానికి కూడా కాంగ్రెసు అధిష్టానం సిద్దపడినట్లు తెలుస్తోంది. ఆయన రాహుల్ గాంధీతో సమావేశం కావడమే దానికి నిదర్శనంగా చెబుతున్నారు. కుందూరు జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికె అరుణ, దామోదర రాజనర్సింహ - ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెసులో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారు చాలా మందే ఉన్నారు. రేవంత్ రెడ్డి రాకకు సహకరిస్తే సరి, లేకుంటే వారి దారి వారు చూసుకోవచ్చుననే కఠినమైన నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు.

మర్రి శశిధర్ రెడ్డి ఇలా...

మర్రి శశిధర్ రెడ్డి ఇలా...

రేవంత్‌ రెడ్డి పార్టీలోకి తీసుకోవడమా, లేదా అనేది అధిష్ఠానం నిర్ణయమని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు శిరోధార్యమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రిశశిధర్‌రెడ్డి అన్నారు. అది పార్టీని బలోపేతం చేయడానికే పనికి వస్తుందని చెప్పారు. ఆయన రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నారు.

వీరంతా ఇలా....

వీరంతా ఇలా....

రేవంత్ రెడ్డి బలమైన నాయకుడని, కాంగ్రెస్‌లోకి వస్తే స్వాగతిస్తామని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైకమాండ్‌ సూచన మేరకు సీనియర్లందరూ రేవంత్‌ రెడ్డిని స్వాగతించాల్సిందేని, పార్టీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి చేరికలు అవసరమని అభిప్రాయపడ్డారు. రేవంత్‌ కాంగ్రెసులోకి రావడం పార్టీకి కలిసి వస్తుందని, పార్టీ బాగు కోరే వారెవ్వరూ ఆయన రాకను వ్యతిరేకించరని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఇక రేవంత్‌ వస్తే పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ అన్నారు. హైకమాండ్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

English summary
It is said that Congress seniors are opposing to induct Telugu Desam Party Telangana working president Revanth Reddy into Congress
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X