ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని ఆడేసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన నాయకులు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతున్నారు. డిసెంబర్ 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆయన ట్రోలింగ్ కు ప్రధాన కారణం. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి గూడా లో సర్పంచ్ గా అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిపాలు కాగా, బిజెపి అభ్యర్థి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన ట్రోలింగ్ కు గురవుతున్నారు.
అనిరుధ్ రెడ్డిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన నాయకులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణమే ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా ఆపుతానని ఇటీవల అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల దిష్టితో ఆంధ్ర అభివృద్ధి ఆగిందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన కౌంటర్ గా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
ఆంధ్ర ప్రజలు హైదరాబాదులో దందాలు చేసుకుంటే మేము ఇబ్బంది పెట్టామా.. కానీ తెలంగాణా ప్రజల దిష్టితో కొబ్బరిచెట్లు చనిపోతున్నాయి అని పవన్ ఆరోపించడం ఎంతవరకు సబబు అని ప్రజలే చెప్పాలని ప్రశ్నించారు. మోడీ, చంద్రబాబు క్లోజ్ అని పవన్ కళ్యాణ్ అహంకారంతో మాట్లాడుతున్నాడని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తక్షణం తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్ నే గెలిపించుకోలేకపోయావ్.. పవన్ సినిమాలు ఆపుతావా?
ఈ క్రమంలోనే తాజాగా తొలి విడత పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారని, పవన్ కళ్యాణ్ సినిమాలు ఏం ఆపుతాం? పక్క పార్టీ వాళ్ళు గెలవకుండా ఆపలేకపోయావ్ అంటూ టార్గెట్ చేస్తున్నారు. ముందు నీ పైన సొంతూరులో ఉన్న వ్యతిరేకతను ఆపుకో చాలు అంటూ సలహాలిస్తున్నారు. నియోజకవర్గంలో ముందు నీ పార్టీని చక్కబెట్టుకో, తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుదువు గాని అంటూ సోషల్ మీడియా వేదికగా అనిరుద్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications