పేద మహిళ కోసం మళ్లీ డాక్టర్ గా మారిన ఎమ్మెల్యే.. ఆపరేషన్ సక్సెస్

ప్రజా సేవే లక్ష్యంగా పలు వృత్తులలో ఉన్న వారు సైతం రాజకీయాల్లో రాణించడం సహజమే. అయితే ఓ పేద మహిళ కోసం మళ్లీ డాక్టర్ గా మారాడు ఓ ఎమ్మెల్యే. ఒంటిపై ఆఫ్రాన్ వేసుకుని.. చేతిలో కత్తెర పట్టుకుని స్వయంగా ఓ అరుదైన ఆపరేషన్ చేసి.. ఓ పేద మహిళకు అరుదైన ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా చేసి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ స్టోరీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

డాక్టర్ వృత్తిలో నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారిలో.. అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కూడా ఒకరు. ఎప్పుడూ రాజకీయాలే కాకుండా.. అప్పుడప్పుడు తమ వృత్తిని గుర్తు చేసుకుంటూ ఆ రకంగా కూడా ప్రజాసేవ చేస్తూ ప్రజలతో నీరాజనాలు పొందుతారు. లేటెస్ట్ గా ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి సోషల్ మీడియా ద్వారా నియోజకవర్గం మొత్తం వ్యాపించింది. దీంతో ఎమ్మెల్యే చేసిన పనికి ప్రజలు సైతం ఎమ్మెల్యేను కొనియాడుతున్నారు.

MLA became doctor again for a poor woman

చారకొండ మండలానికి చెందిన గోరేటి లక్ష్మమ్మ.. గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రిలో చూపించుకోగా కడుపులో కణితి ఉందని ఆపరేషన్ చేసి తీసేయ్యాలని సూచించారు. అయితే అందుకు బాగా ఖర్చవుతుందని చెప్పటంతో లక్ష్మమ్మ వైద్యం చేయించుకోకుండానే ప్రైవేటు హాస్పిటల్‌ నుంచి వెనుదిరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో అచ్చంపేట ఏరియా ఆస్పత్రిలో రెండోసారి నిర్వహించిన సర్జికల్ క్యాంపులో లక్ష్మమ్మ పాల్గొన్నారు.

తన అనారోగ్య పరిస్థితి గురించి వంశీకృష్ణకు విన్నవించుకుంది. లక్ష్మమ్మ పేదరికాన్ని అర్ధం చేసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.. ఏరియా ఆస్పత్రి వైద్యులతో కలిసి లక్ష్మమ్మకు ఆపరేషన్ చేశారు. కడుపులో ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రికి వెళితే లక్షల్లో ఖర్చయ్యేవని.. కానీ ఎమ్మెల్యే వంశీకృష్ణ పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ చేశారని లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+