హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్: కేంద్రానికి హైకోర్టు గడువు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టుకు వెల్లడించారు. పౌరసత్వ వివాదంపై వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా తన జర్మనీ పౌరసత్వం వెనక్కిచ్చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన కౌంటర్‌పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది హైకోర్టు.

MLA chennamaneni Ramesh leaves his German citizenship: High Court gives two weeks time for centre to file counter

మరోసారి ఎవరూ గడువు కోరవద్దనీ, తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు స్పస్టం చేసింది. ఆ తర్వాత విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కాగా, చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం(భారత్ తోపాటు జర్మనీ) కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

English summary
MLA chennamaneni Ramesh leaves his German citizenship: High Court gives two weeks time for centre to file counter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X