రేవంత్‌పై ఎమ్మెల్యే కృష్ణారావు సంచలనం, నేనూ అతని వెంటే.. బాబుకు శశికళ లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిడిపి బీ ఫార్మ్ పైన గెలిచి, టీఆర్ఎస్‌లోకి వెళ్లిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: ఉండలేను.. వెళ్తావా: భుజంపై బాబు చేయి, రేవంత్ కంటతడి, ఏపీ సీఎంవోలో ఎమోషనల్

రేవంత్ రెడ్డి ఓ ఐరన్ లెగ్

రేవంత్ రెడ్డి ఓ ఐరన్ లెగ్

రేవంత్‌ను ఐరన్ లెగ్‌గా అభివర్ణించారు. తెలంగాణలో టీడీపీ నాశనం కావడానికి ఆయనే కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీకి శని పట్టుకోవడం వల్లే రేవంత్‌ను ఆహ్వానించారని, టీడీపీలోకి వచ్చిన ఆరేళ్లలోనే పార్టీని భ్రష్టు పట్టించిన ఘనత ఆయనదే అన్నారు.

మేం 30 ఏళ్లు టీడీపీని నిర్మిస్తే, రేవంత్ నిమిషాల్లో నాశనం

మేం 30 ఏళ్లు టీడీపీని నిర్మిస్తే, రేవంత్ నిమిషాల్లో నాశనం

తమవంటి నేతలు మూడు దశాబ్దాల పాటు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశామని, రేవంత్ వంటి వ్యక్తులు దానిని నిమిషాల్లో సర్వనాశనం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

టీడీపీ నుంచి మరో వికెట్ డౌన్

టీడీపీ నుంచి మరో వికెట్ డౌన్

తెలంగాణ టీడీపీలో వరుసగా వికెట్లు పడుతున్నాయి. రేవంత్ రెడ్డి వెంట చాలామంది నేతలు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవ రెడ్డి తన రాజీనామాను ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు పంపించారు. అంతేకాదు, తాను రేవంత్ రెడ్డి నడవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

రేవంత్ రెడ్డికి తెలివి ఉండాలి

రేవంత్ రెడ్డికి తెలివి ఉండాలి

ఇదిలా ఉండగా, ఆదివారం పలువురు కొడంగల్ నేతలు మంత్రి లక్ష్మారెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడారు. దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అన్నారు. అలాంటి పార్టీలోకి వెళ్లి రేవంత్ రెడ్డి ఏం ఉద్దరిస్తారని ప్రశ్నించారు. ఎప్పుడూ కేసీఆర్ పైన విమర్శలు చేసే రేవంత్‌కు తెలివి ఉండాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TRS leader and MLA Madhavaram Krishna Rao controversial comments on Revanth Reddy for joining Congress party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి