ఉండలేను.. వెళ్తావా: భుజంపై బాబు చేయి, రేవంత్ కంటతడి, ఏపీ సీఎంవోలో ఎమోషనల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/కొడంగల్/అమరావతి: టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన సమయంలో ఏపీ సీఎంవోలో ఉద్విగ్న వాతావరణం కనిపించింది. చంద్రబాబు ఉద్వేగానికి లోను కాగా, రేవంత్ రెడ్డి కంటతడి పెట్టారు.

చదవండి: రేవంత్ వెళ్లకుండా ఆపండి: అమిత్ షా ఫోన్, చేతులెత్తేసిన బాబు

రేవంత్ రెడ్డి టిడిపికి, కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి శనివారం రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను సభాపతికి నిబంధనల ప్రకారం రాయాల్సిన విధానం (ఫార్మాట్)లో ఒకే వాక్యంలో రాశారు.

చదవండి: రేవంత్ రెడ్డి రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు ఇవీ...

  MLA Revanth Reddy resignation issue ఆ సస్పెన్స్ కూడా బద్దలు కొట్టిన రేవంత్ | Oneindia Telugu

  'నేను శాసనసభ సభ్యత్వానికి ఈ నెల 27 నుంచి ఈ రాజీనామా సమర్పిస్తున్నాను' అని ఆ లేఖలో పేర్కొన్నారు. టిడిపికి రాజీనామా చేయడానికి కారణాలను వివరిస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు మూడు పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే.

  చదవండి: పోతే పో, ఉంటే ఉండు!: రేవంత్‌కు 'బిగ్' షాక్, ఇదీ బాబు ప్లాన్, దూళిపాళ్ల సంధి ప్రయత్నం విఫలం

  బాబు నివాసంలో భేటీ

  బాబు నివాసంలో భేటీ

  శనివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన తెలంగాణ టిడిపి ముఖ్యనేతల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్‌, ఉమా మాధవరెడ్డి, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వరరావు, గరికపాటి మోహన్ రావు, అమర్నాథ్ బాబు, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  వెళ్తావా అని బాబు అనగానే రేవంత్ కళ్లలో నీళ్లు

  వెళ్తావా అని బాబు అనగానే రేవంత్ కళ్లలో నీళ్లు

  మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం ఉందని చంద్రబాబు వెళ్తున్నారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి వెంట వెళ్లి.. నేను ఇక ఉండలేను, వెళ్లిపోతాను అని చెప్పారు. చంద్రబాబు ఆయన భుజంపై చేయి వేసి తట్టి.. వెళ్తావా అని ఉద్వేగంగా అడిగారు. దీంతో రేవంత్‌ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

  లోపలకు వెళ్లి కూర్చో అంటే..

  లోపలకు వెళ్లి కూర్చో అంటే..

  వెళ్లే ముందు రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు చేతులు జోడించి నమస్కరించారు. థ్యాంక్స్ సర్.. నన్ను మీ బిడ్డలా చూసుకున్నారు అని రేవంత్ ఆయనతో అన్నారు. లోపలకు వెళ్లి కూర్చో.. మీడియా సమావేశం తర్వాత మాట్లాడుదామని చెప్పగా.. నేను ఉండలేను సర్ అన్నారు.

  రేవంత్ రెడ్డి వెంట వేం నరేందర్ రెడ్డి

  రేవంత్ రెడ్డి వెంట వేం నరేందర్ రెడ్డి

  తెలంగాణలో పరిస్థితిని, రాజీనామాకు కారణాలను రేవంత్‌ తెలిపారు. బయటికి వచ్చి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి రాజగోపాల్‌కు రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కూడా ఆయన వెంట వెళ్లారు.

  ఏపీ సీఎంవోలో ఉద్విగ్న వాతావరణం

  ఏపీ సీఎంవోలో ఉద్విగ్న వాతావరణం

  మరో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి.. చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ఇక వస్తాం సర్ అంటూ చేతులు జోడించి నమస్కరించి బయటకు వచ్చారు. ఈ పరిణామాలతో ఏపీ సీఎంవోలో ఉద్విగ్న వాతావరణం కనిపించింది.

  రేవంత్ రాజీనామా లేఖను చదవమన్న బాబు

  రేవంత్ రాజీనామా లేఖను చదవమన్న బాబు

  అనంతరం తెలంగాణ నేతలతో చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి పెడతానని, నెలకోసారి హైదరాబాద్‌ వచ్చి ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశమవుతానని చెప్పారు. వచ్చే నెల 2న రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి హాజరవుతానన్నారు. టీడీపీకి గతంలో అనేక సంక్షోభాలు ఎదురైనా ఏమీ కాలేదని, నేతలు వెళ్లినా కార్యకర్తలు పార్టీలోనే ఉన్నారన్నారు. రేవంత్‌ రాజీనామా లేఖను చదవమని అమర్ననాథ్ బాబుకు ఇచ్చారు. అందులోని అంశాలపైనా చర్చించారు.

  నాడు రేవంత్ వెంట ఢిల్లీకి జానా తనయుడు

  నాడు రేవంత్ వెంట ఢిల్లీకి జానా తనయుడు

  కాగా, రేవంత్ రెడ్డి బాటలో పలువురు టీడీపీ నేతలు నడిచే అవకాశముంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేతలను రేవంత్ వెళ్లి కలిస్తున్నారని తెలుస్తోంది. పది నుంచి 20 స్థానాల్లో రేవంత్ మాట చెల్లుబాటు అయ్యేలా కనిపిస్తోంది. కాగా, ఇటీవల రేవంత్ ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయనతో పాటు జానారెడ్డి తనయుడు కూడా ఉన్నారని తెలుస్తోంది.

  31న కాంగ్రెస్ పార్టీలోకి ముహూర్తం

  31న కాంగ్రెస్ పార్టీలోకి ముహూర్తం

  టీడీపీకి రాజీనామా చేయడంతో రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైపోయింది. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నవంబరు 9న తెలంగాణలో బహిరంగ సభ ఉంటుందని, ఆ సందర్భంగా రేవంత్‌ తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరతారని తొలుత భావించారు. కానీ ఈ నెల 31నే ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరనున్నారని తెలుస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Telugu Desam Party (TDP) MLA A Revanth Reddy resigned from his post as working president and also from the party on Saturday. Revanth went to Vijayawada to meet TDP president and CM N Chandrababu Naidu to discuss his exit from the party unit in Telangana, but returned to Hyderabad without meeting Naidu. He handed over his resignation letter to the CM’s camp office. Revanth also resigned from his MLA post and hinted that he may join Congress and seek by-election.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి