కేసీఆర్‌ను మించిన పెద్ద దళితుడు లేడట.. ఎలాగో చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్
టిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని, తడీపార్ అమిత్ షా కు, తంబాకు బండి సంజయ్ ఎన్ని చెప్పులు మోసినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం మునుగోడు ఆత్మగౌరవాన్ని బిజెపి కాళ్ళ ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టాడని, తప్పకుండా ప్రజలు దీనికి బుద్ధి చెప్పి తీరుతారని ఆయన వ్యాఖ్యానించారు.

దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నఎమ్మెల్యే గాదరి కిషోర్
మునుగోడు ఉప ఎన్నిక బీజేపీని రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేస్తుందని, రెండో స్థానం కోసమే బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక మునుగోడు సభలో అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలే అని పేర్కొన్న ఆయన, ప్రజల భావోద్వేగాలతో బిజెపి రాజకీయాలు చేయాలని చూస్తోందని, ఇందులో భాగంగానే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని మళ్ళీ తెరమీదకు తెచ్చి మాట్లాడారని విమర్శించారు. అసలు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి, అమిత్ షా కు లేదని ఎమ్మెల్యే గాదరి కిషోర్ పేర్కొన్నారు.

కేసీఆర్ ఏనాడూ దళితుడిని సీఎం చేస్తానని చెప్పలేదు
ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే గాదరి కిషోర్. సీఎం కేసీఆర్ ఏ నాడు దళితుడిని సిఎం చేస్తానని చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో సీఎం కేసీఆర్ ను మించిన పెద్ద దళితుడు మరొకరు లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా ఆయన దళితుడిని సిఎం చేస్తానని ప్రకటన చేయలేదన్నారు. ఎవరైతే అణిచివేతకు గురవుతారో వాళ్లే దళితులని, కెసిఆర్ ని మించిన పెద్ద దళితుడు లేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే గాదరి కిషోర్.

దళిత సీఎంలు పాలించిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి చెప్పాలి
అసలు బీజేపీకి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్న ఆయన 22 మంది కేంద్ర మంత్రులు, దళితులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని బీజేపీ ని టార్గెట్ చేశారు. దళిత బంధు పథకం అందించాలన్న సోయ లేని బీజేపీ దళితుల గురించి మాట్లాడడం దారుణమన్నారు. దళిత ముఖ్యమంత్రులు పాలించిన రాష్ట్రాలు ఏ మాత్రం బాగా పడ్డాయో చెప్పాలన్నారు. దళితుడిని రాష్ట్రపతిని చేసి ఏం సాధించారో చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రశ్నించారు.

గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తే గిరిజనుల బతుకులు బాగుపడతాయా?
ఇప్పుడు గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారని, అంతమాత్రాన గిరిజనుల జీవితాలు బాగు పడిపోతాయా అంటూ బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. టిఆర్ఎస్ పార్టీపై మాట్లాడటానికి సిగ్గు ఉండాలి అంటూ మండిపడ్డారు. ఇక ఎమ్మెల్సీ కవిత నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారిణి అని పేర్కొన్న ఆయన, ఆమెపై చేసిన ఆరోపణలను నిరాధారమైనవని కవిత తేల్చి చెప్పారని గుర్తు చేశారు. బిజెపి నాయకులు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని, బీజేపీ ఓటమి తధ్యమని ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యానించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications