ఎగ్గొట్టేందుకే: జైలు శిక్షపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, అసలేం జరిగింది?
హైదరాబాద్: తనకు న్యాయస్థానం జైలు శిక్ష విధించడంపై పటాన్ చెరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్పందించారు. కార్మికుడికి ఇచ్చిన చెక్కును ఎగ్గొట్టేందుకే యజమాని తన పైన కేసు పెట్టాడని ఆరోపించారు. బాధిత కుటుంబం కోరితేనే ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పరిశ్రమకు వెళ్లి నష్టపరిహారం ఇప్పించానని చెప్పారు.
తాను కోర్టు తీర్పును గౌరవిస్తానని చెప్పారు. కోర్టు ఇచ్చిన గడువులోగా తాను పైకోర్టుకు వెళ్తానని చెప్పారు. పరిశ్రమ యజమానిని దూషించి, అతనితో దౌర్జన్యంగా చెక్కు రాయించిన కేసులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కోర్టు గురువారం నాడు రెండున్నరేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించింది.
ఏం జరిగింది?
గత ఏడాది మే 3వ తేదీన పటాన్ చెరు మండలం పాశమైలారంలోని వెర్సా టైల్స్ పరిశ్రమ ప్యాకింగ్ విభాగంలో పని చేస్తున్న కార్మికుడు ఇరవై ఏళ్ల మహేష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన అనుచరులు 70 మందితో పరిశ్రమ యజమాని పాటి చందుకుమార్ క్యాబిన్‌లోకి వెళ్లారు.

వేధింపుల వల్లే కార్మికుడు మృతి చెందాడని యజమానిని ఎమ్మెల్యే దూషించారు. కార్మికుడి కుటుంబానికి రూ. లక్ష పరిహారం ఇస్తామని యజమాని చెప్పాడు. దానికి ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. రూ.15 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని బలవంతంగా చెక్కు రాయించుకున్నారు.
దీంతో, యజమాని చందు కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిడిఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వాదోపవాదాలు విన్న జిల్లా కోర్టు అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి... మహిపాల్ రెడ్డికి రెండున్నరేళ్ల జైలు శిక్ష, రూ.2500 జరిమానా విధించారు. 3 రోజుల్లో పైకోర్టుకు వెళ్లేందుకు అవకాశమిస్తూ బెయిల్ మంజూరు చేశారు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కోర్టు దోషిగా నిర్ధారించి, రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో అతని పైన అనర్హత వేటు పడుతుందా అనే చర్చ సాగుతోంది. కొన్నింటికి మాత్రమే ఆటోమేటిక్ డిస్‌క్వాలిఫై అప్లై అవుతుందని చెబుతున్నారు. అదే సమయంలో మహిపాల్ రెడ్డికి పైకోర్టుకు వెళ్లేందుకు న్యాయస్థానం 30 రోజుల సమయం కూడా ఇచ్చింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications