"మీరు చేస్తే సంసారం... మేం చేస్తే వ్వభిచారామా"

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్ధితి ఏర్పడింది. పార్టీ ఫిరాయింపులపై టీటీడీపీ నేతల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ "మీరు చేస్తే సంసారం... మేం చేస్తే వ్వభిచారామా" అంటూ ప్రశ్నించి కలకలం రేపారు. తెలంగాణ టీడీపీ నేతలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు మీటనొక్కితే ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి బొమ్మల్లా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఇతర పార్టీల నేతలను మీ పార్టీలో చేర్చుకోవడం లేదా? అని ప్రశ్నించారు. ఇతర పార్టీ నేతలను మీ పార్టీలో చేర్చుకోగా లేనిది, మేం చేర్చుకుంటే తప్పేమిటని ఆయన నిలదీశారు.

mla jeevan reddy fires telangana telugu desam party Mla's

డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ అన్నావ్... ఒక్క ఇల్లన్నా కట్టిచ్చావా కేసీఆర్: ఉత్తమ్ కుమార్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పీసీసీ తాజా చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేప్టటిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయాలతో ఇళ్లు కట్టించి ఇస్తే వాటిపై విమర్శలు చేశారని, అగ్గిపెట్టేల్లాంటి ఇళ్లని, కాళ్లు చాపుకుంటే కష్టమని నానా మాటలు అన్నారని గుర్తు చేశారు.

అదే కేసీఆర్ నాలుగు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు కట్టిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చారని తెలిపారు. మార్చి నాటికి ఒక్క ఇల్లన్నా కట్టిచ్చావా కేసీఆర్? అంటూ ప్రశ్నించారు.

"కేసీఆర్ కరీంనగర్ వెళ్లి ఆ నగరాన్ని న్యూయార్క్ చేస్తానని అంటాడు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తానని, మరోసారి సింగపూర్ చేస్తానని, ఇంకోసారి డల్లాస్ చేస్తానని" అంటాడు అని ఎద్దేవా చేశారు. అవన్నీ కాదని, సామాన్యుడికి మేలు చేసే పనులు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్‌కు హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+