దళిత బంధు భేష్: అద్భుత పథకం, విపక్షాలపై ఎమ్మెల్యే క్రాంతి ఫైర్
రాష్ట్రంలో ఇప్పుడు దళిత బంధు గురించి చర్చ.. హుజురాబాద్ ఎన్నికల స్టంట్ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ అధికార పక్షం మాత్రం మంచి పథకం అని కీర్తిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అధ్బుతంగా ఉందని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. జీర్ణించుకొలేని ప్రతిపక్ష పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. గురువారం రాయికోడ్ మండల కేంద్రంలో రైతు వేదికను ప్రారంభించారు.
Recommended Video
రైతు బంధు పథకంపై కాంగ్రెస్, బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని క్రాంతి కిరణ్ అన్నారు. గందరగోళం సృష్టిస్తునాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై ప్రేమ ఉంటే వారి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని అన్నారు. దశలవారీగా అమలు చేసే పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా సీఎం కేసీఆర్ తెలిపారు.
దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. నియోజకవర్గంలో గల అన్ని మండలాల్లో దళిత కుటుంబాల వివరాల స్థితి గతులను తెలుసుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలు అవుతుందని చెప్పారు. అదనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications