సదా రేవంత్ రెడ్డి బాటలోనే అంటున్న పాడి కౌశిక్ రెడ్డి!

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాడి చేసిన ఘటన పైన పోలీసులు కేసు నమోదుచేసి ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన పాడి కౌశిక్ రెడ్డికి నేడు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

సంజయ్ పై తాను దాడి చెయ్యలేదన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
అయితే తాను కరీంనగర్ కోర్టుకు హాజరు కావలసి ఉందని ఈ నేపథ్యంలో జనవరి 17వతేదీన కోర్టుకు హాజరవుతానని పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు సమాధానం ఇచ్చారు. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సంజయ్ పైన తను దాడి చెయ్యలేదన్నాడు. ముందుగా తన చాతి పైన చెయ్యి పెట్టి సంజయ్ తనను వెనక్కి నెట్టాడని, ఆపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాలరు పట్టుకుని లాగాడన్నారు.

MLA Padi Kaushik Reddy said that revanth reddy showed the path to him

మంత్రి ఆదేశాలతోనే తన మీద కేసు
మంత్రి శ్రీధర్ బాబు వేలు చూపించి బెదిరించాడన్నారు. పోలీసులు నెట్టివేయడంతో తాను కింద పడ్డానని తెలిపారు. అసలు తను ఎటువంటి దాడి చేయకుండానే తన మీద కేసు పెట్టారని మంత్రి ఆదేశాలతోనే ఇదంతా జరిగిందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ లాగా తను పైసలకి అమ్ముడు పోలేదని, కెసిఆర్ టికెట్ ఇస్తే ప్రజలు తనకు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచానన్నారు.

తనకు రేవంత్ రెడ్డే ఆదర్శం
పార్టీ మారిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ప్రశ్నించమని చెబితేనే తాను ప్రశ్నించానని ఈ విషయంలో తనకు రేవంత్ రెడ్డినే ఆదర్శం అంటూ పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమని రేవంత్ రెడ్డి చెప్పాడని కానీ తాను రాళ్లతో కొట్టలేదన్నారు. జస్ట్ ప్రశ్నించానని రేపు ఊర్లోకి వస్తే బరాబర్ కార్యకర్తలు రాళ్లతో కొడతారని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

రేవంత్ చెప్పిందే చేస్తాం
పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రశ్నించి నిలదీసే విషయంలో తనకు కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డినే ఆదర్శమని చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పింది తప్పకుండా చేస్తామని స్పష్టం చేశారు.కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కరీంనగర్ కలెక్టరేట్ లో దాడికి యత్నించిన కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం రచ్చగా మారింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+