సీపీ మాట మార్చారు! బండి సంజయ్ ఏ1 ఎలా అవుతారంటూ రఘునందన్ రావు ప్రశ్నలు
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ విషయంలో వరంగల్ పోలీస కమిషనర్ రంగనాథ్.. రోజు వ్యవధిలోనే మాటలు మార్చారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సీపీ రంగనాథ్ ప్రభుత్వ పెద్దల మాటలే ఆయన చెప్పారా? అని నిలదీశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ సీపీ రంగనాథ్ ఏప్రిల్ 4వ తేదీ ఒక మాట చెప్పి.. 5వ తేదీ మరో మాట చెప్పారని గుర్తు చేశారు.
ఎవరో వాట్సాప్ ద్వారా పంపించిన పేపర్‌ను చూసి మాట్లాడిన బండి సంజయ్ ఏ1 ముద్దాయి ఎలా అవుతారని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఉదయం 9 గంటల 37 నిమిషాలకు పేపర్ లీక్ అయితే.. 11.30 గంటలకు బండి సంజయ్‌కు వాట్సాప్‌లో పేపర్ వచ్చిందని చెబుతున్నారని.. ఆ సమయానికి సగం మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసి బయటకు వస్తారని.. బయటకు వచ్చిన క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే.. ఎలా లీక్ చేసినట్లు అవుతుందని రఘునందన్ రావు నిలదీశారు.

శివగణేషన్ ఉదయం 9.37 గంటలకు పేపర్‌ను ఫోన్లో ఫొటో తీశారని.. బండి సంజయ్‌కు పంపింది 11.30 గంటలకు అని.. ఈ మధ్యలో 200 వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు అయ్యిందని.. వాళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఎవరూ లేరా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. వీళ్లందరినీ వదిలేసి బండి సంజయ్‌ను మాత్రమే అరెస్ట్ చేయడం వెనుక కుట్ర ఉందని స్పష్టంగా తెలుస్తుందన్నారు. తన ప్రశ్నలకు వరంగల్ సీపీ రంగనాథ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘునందన్.
కోర్టులపై తమకు నమ్మకం ఉందన్న రఘునందన్.. ఈ ప్రశ్నలన్నింటికీ అక్కడే న్యాయం జరుగుతుందన్నారు. ఇంతకీ నిందితుడిగా చెబుతున్న శివగణేషణ్ తన ఫోన్‌ను 24 గంటల్లోనే కోర్టులో డిపాజిట్ చేశారా? లేదా అనేది పోలీసులు చెప్పాలన్నారు. క్వశ్చన్ పేపర్ ఫొటో తీసిన వ్యక్తికి.. బీజేపీతో సంబంధం ఉందా? లేదా? అని కూడా తేల్చాలన్నారు. వందల మంది పిల్లలు పరీక్ష రాస్తుంటే.. సెంటర్ వద్ద పోలీసులు ఎందుకు లేరని ప్రశ్నించారు. బండి సంజయ్ ఫోన్‌కు పేపర్ వచ్చిన దానికంటే ముందు ఎంత మందికి షేర్ అయ్యిందనేది ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని రఘునందన్ రావు మండిపడ్డారు. పేపర్ లీక్ చేసిన శివగణేషన్ వాట్సాప్ చాట్ ఎందుకు బయటపెట్టడంలేదని పోలీసులను రఘునందన్ ప్రశ్నించారు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని.. కావాలనే ఇందులో బండి సంజయ్‌ని ఇరికించారన్నారు. అధికార పార్టీని సంతృప్తి పరిచేం దుకు సీపీ వ్యవరిస్తున్న తీరు సరికాదని పేర్కొ న్నారు. తాము కోర్టులోనే తేల్చుకుంటామని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications