బీజేపీ అధిష్టానానికి ఎమ్మెల్యే రాజా సింగ్ సతీమణి లేఖ

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సతీమణి ఉషాబాయి బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు. ఆగస్టు 23న రాజా సింగ్‌ను సస్పెండ్ చేస్తూ.. ఎందుకు బహిష్కరించకూడదో పది రోజుల్లో సమాధానం చెప్పాలని బీజేపీ అధిష్టానం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ గడువు రేపటితో ముగియనుంది.

Recommended Video

    KCR దమ్ముంటే మునుగోడులో పోటీ చెయ్,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ *Telangana | Telugu OneIndia

    ఈ క్రమంలో రాజా సింగ్ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఆయన సతీమణి ఉషాబాయి బీజేపీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. రాజా సింగ్ జైలులో ఉన్నారని, తన సస్పెన్షన్ రేపటి(సెప్టెంబర్ 2)తో ముగియనుండటంతో సమయం ఇవ్వాలని కోరారు. కాగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్ ను ఇటీవల పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.

    MLA Raja Singh wife writes a letter BJP high command on MLas suspension notice

    ఇటీవల వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ ప్రదర్శనకు అనుమతి ఇవ్వకూడదని రాజా సింగ్ తోపాటు పలు హిందూ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే, అవేమీ పట్టించుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మునావర్ షోను సజావుగా సాగేలా చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.

    అయితే, మునావర్ షోకు ప్రభుత్వం అనుమతివ్వడం పట్ల రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను, హిందూ దేవీదేతలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మునావర్ షోకు ఎలా అనుమత్తిచ్చారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజా సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ పాతబస్తీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పలు పోలీస్ స్టేషన్లలో రాజా సింగ్ పై ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు రాజా సింగ్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+