వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం రాజయ్య
హైదరాబాద్: బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. వరంగల్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నాపై వచ్చిన ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటపడతానని చెప్పారు. తెలంగాణ సాధన కోసమే అధికార పార్టీని వదిలి టీఆర్‌ఎస్‌లో చేరానని అన్నారు.
పదవి నుంచి తప్పించడంతో నియోజక వర్గ ప్రజలు బాధతో ఉన్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తండ్రి లాంటి వారని, టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతానని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications