ప్రధాని మోడీకి, అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!!
బిజెపి బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర ప్రభుత్వానికి సంచలన లేఖ రాశారు. ఇటీవల హైదరాబాద్లో ఉగ్రవాదుల కదలికలు బయట పడ్డ విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపిన సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ఆసక్తిగా మారింది.
తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ఉగ్రవాద సంస్థల నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని, భారీ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు.

హైదరాబాద్లో అల్లర్లు సృష్టించడంతో పాటు బాంబులతో తమపై దాడి చేయడానికి కుట్రపన్నుతున్నారని విషయం తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అని లేఖలో రాజాసింగ్ వెల్లడించారు. అంతేకాదు ఇప్పటికే దేశవిదేశాల నుంచి తనను చంపేస్తామని అనేక బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని రాజా సింగ్ పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించవలసిందిగా పలుమార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరానని పేర్కొన్న రాజాసింగ్, తాను ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.
గతంలోనూ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు రాజాసింగ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా మరోమారు తనకు భారీ భద్రత కల్పించాలని రాజాసింగ్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్ భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించినప్పటికీ, సెక్యూరిటీని పెంచకపోవడం తో రాజాసింగ్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు.
ఇక ఏకంగా తన భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లేఖ రాయడం గమనార్హం. ఇదిలా ఉంటె రాజాసింగ్ పదేపదే ప్రాణహాని ఉందని అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తున్న వేళ ఆయన భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా? లేదా? తెలియాల్సి ఉంది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications