వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గతం మర్చిపోతే ఎలా.. సస్పెన్షన్ పై మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ చురకలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం నిత్యం కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు టిఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తుంటే, రాష్ట్రంలోని టిఆర్ఎస్ సర్కార్ ను బిజెపి నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్ నిత్యం సోషల్ మీడియా వేదికగా కేంద్రంలో బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేటీఆర్ ట్వీట్ లకు బిజెపి నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఏ మాత్రం తగ్గకుండా ఆయనకు చురకలు అంటిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణాలో.. దమ్ముంటే ఆపాలని కేసీఆర్ కు రాజాసింగ్ సవాల్మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణాలో.. దమ్ముంటే ఆపాలని కేసీఆర్ కు రాజాసింగ్ సవాల్

పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ పై కేటీఆర్ విమర్శలు

పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ పై కేటీఆర్ విమర్శలు


తెలంగాణ మంత్రి కేటీఆర్ పార్లమెంటులో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల & నిత్యావసరాలపై జిఎస్టి పెంపుపై చర్చ జరపాలని, టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెచ్చిన ఒత్తిడి నేపథ్యంలో చర్చకు అంగీకరించే బదులు, పది రోజులపాటు రాజ్యసభ నుంచి టిఆర్ఎస్ ఎంపీలను సస్పెండ్ చేశారని ట్వీట్ చేశారు. ప్రభుత్వం దేనికి భయపడుతోంది? ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఎందుకు? అంటూ ప్రశ్నించారు. ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

గతం మర్చిపోయావా.. మమ్మల్ని అసెంబ్లీ నుండి సస్పెండ్ చెయ్యలేదా ? రాజా సింగ్

గతం మర్చిపోయావా.. మమ్మల్ని అసెంబ్లీ నుండి సస్పెండ్ చెయ్యలేదా ? రాజా సింగ్


ఇక ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేటీఆర్ గతాన్ని గుర్తు చేసుకోవాలంటూ చురకలంటించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ మొత్తం సస్పెండ్ చేశారు కదా.. ఎంపీల సస్పెన్షన్ గురించి చేసే అధికారం మీకు లేదు అంటూ, ఇలాంటి ప్రశ్నలు మీరు అడగకుండా ఉంటేనే మంచిది అంటూ హితవు పలికారు. ఇటువంటి ప్రశ్నలు అడిగి అపహాస్యం పాలు కావద్దన్నారు. ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్ గతం మర్చిపోయావా అంటూ సెటైర్లు వేశారు.

ఓటీటీలో ఆ సినిమా చూడు కేటీఆర్... రాజాసింగ్ సలహా

ఓటీటీలో ఆ సినిమా చూడు కేటీఆర్... రాజాసింగ్ సలహా


ఇక ఇదే సమయంలో ఓటీటీలో ఏ సినిమాలు చూడాలి అని అడుగుతున్నావు కదా కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడు అంటూ సలహా ఇచ్చారు. లేదంటే వాజ్ పేయి, మోదీ చరిత్రను కేటీఆర్ తెలుసుకోవాలని సూచించారు. నాస్తికుడి నుంచి ఆస్తికుడుగా అవుతారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కేటీఆర్ కు చెప్పుకొచ్చారు. ఇక ఓటీటీ లో ఏ సినిమాలు చూడాలని కేటీఆర్ సలహా అడగడాన్ని రాజాసింగ్ తప్పుబట్టారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటివి అడగడం సిగ్గుచేటని విమర్శించారు.

English summary
KTR, who is now talking about the suspension of MPs, did not remember that BJP MLAs were suspended in the past, MLA Rajasingh lashed out at Minister KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X