తాను పీసిసి చీఫ్ ఐతే వేరే లెవల్ లో ఉండేది.!రేవంత్ పై గులాబీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సంచలన వ్యాఖ్యలు.!
మహబూబాబద్/హైదరాబాద్ : ఇది సొంత పార్టీ వ్యవహారం కాదు. ఉన్న పార్టీ అంతర్గత రహస్యం అసలే కాదు. పక్క పార్టీనేత ఇంకో పార్టీ పగ్గాలు చేపడితే ఎంత పొడిచిచూపించేవాడినో మాటలతో చెప్పలేను అనే డాంభికంతో కూడుకున్న వ్యాఖ్యలు చేసారు ఓ సీనియర్ మోస్ట్ జూనియర్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్టు మంత్రిగా కూడా పనిచేసిన రెడ్యానాయక్ ప్రస్తుతానికి అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ఆయన సొంత పార్టీలో జరిగిగే వ్యవహారాలగురించి ఏనాడూ స్పందించిన దాఖలాలు లేవు గానీ, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకుని సెకండ్లలో స్పందిస్తున్నారు. రెడ్యానాయక్ గులాబీ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన మనసంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టుందనే చర్చ జరుగుతోంది. మహబూబాబాద్ లో తాజాగా జరిగిన బహిరంగ సభలో సొంత పార్టీ గురించి కాకుండా ప్రత్యర్తి పార్టీ ఐన కాంగ్రెస్ మీద, ఆ పార్టీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసారు రెడ్యా నాయక్.

అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గిరిజన మంత్రి రెడ్యా నాయక్ సొంత పార్టీ వ్యవహారాల కన్నా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపట్ల లోతుగా దృష్టి కేంద్రీకరించినట్టు చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ ఎంపీ పదవి తొలగించడంపై చాలా లోతుగా స్పందించారు రెడ్యానాయక్. రాహుల్ గాంధీకి సంఘీభావంగా ఏ ఒక్క రోజైనా పీసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారా అని ప్రశ్నించారు. బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఘాటు వ్యాఖ్యలు చేసారు.

అంతే కాకుండా తాను పీసీసీ చీఫ్ గా ఉండి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి వేరే విధంగా ఉండేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. సభలో ఉన్న వారందరూ రెడ్యానాయక్ వ్యాఖ్యలపట్ల ఖంగుతిన్నంత పనయ్యింది. గులాబీ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడి నైతే బాగుండు అనే స్దాయిలో మాట్లాడటం ఏంటనే గుసగుసలుమొదలైనట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో సుధీర్గ అనుభవం ఉన్న రెడ్యానాయక్ వ్యాఖ్యలపట్ల గులాబీ తోటలో జిలేబీ లాంటి చర్చ జరగుతున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications