ఈడీ, బోడీ, మోడీలకు భయపడే రోజులు పోయాయి: ఎమ్మెల్యేల ఎరకేసు ఎమ్మెల్యే సంచలనం!!

ఎమ్మెల్యేల ఎరకేసు కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలోకి వెళ్ళటం బీఆర్ఎస్ నేతలకు గుబులు పుట్టిస్తున్నా ఆ నేతకు మాత్రం టెన్షన్ ఏ మాత్రం కనిపించటం లేదు. సిట్ విచారణ జరుపుతుంది అని భావించిన ఎమ్మెల్యేల ఎరకేసు ఊహించని విధంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు చేసే స్థాయికి వెళ్లింది. ఇక ఈ సమయంలో ఈ కేసులో ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డి ఓ పక్క వణికిపోతుంటే, ఎమ్మెల్యే రేగా కాంతారావు మాత్రం భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు.

కేంద్రంపై ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలనం

కేంద్రంపై ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలనం


పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈడీ దర్యాప్తు హడావుడి కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈడీ.. బోడీ.. మోడీ లకు భయపడే రోజులు పోయాయని రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంవత్సరకాలంలో దొంగల పాలన పోయి దేశ ప్రజలకు కేసీఆర్ నాయకత్వంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు నీతివంతమైన పాలన వస్తుందని పేర్కొన్నారు.

ఇప్పుడు ఈడీ నోటీసులు వస్తే దొంగలు పండుగ చేసే రోజులు

ఇప్పుడు ఈడీ నోటీసులు వస్తే దొంగలు పండుగ చేసే రోజులు

దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బోర్డర్లో ఉన్న బీజేపీ పాలన సాగిస్తున్న రాష్ట్రాల ప్రజలు తెలంగాణ పథకాలు అమలు చేస్తారా లేక మా గ్రామాలను తెలంగాణలో కలుపుతారా అని ప్రశ్నిస్తుంటే బిజెపి నాయకులు సిగ్గుపడాలని మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో ఈ డి నోటీసులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలో ఈడీ నోటీసులు వస్తే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవని కానీ ప్రస్తుతం ఈడీ నోటీసులు వస్తే దొంగలు పండుగ చేసుకునే రోజులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు .

పైలట్ రోహిత్ రెడ్డిలో టెన్షన్ .. రేగాకు మాత్రం నో టెన్షన్

పైలట్ రోహిత్ రెడ్డిలో టెన్షన్ .. రేగాకు మాత్రం నో టెన్షన్

బిజెపి కాలంలో దేశం ఎంతగా అభివృద్ధి చెందింది అంటూ రేగా కాంతారావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక రేగా కాంతారావు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కారణంగా మారాయి. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులు ట్రాప్ చేయాలని ప్రయత్నం చేసిన నాయకులలో ఒకరు. ప్రస్తుత ఎమ్మెల్యేల ఎర కేసును ఈ డి తో, పాటు సిబిఐ దర్యాప్తు చేయనున్న నేపథ్యంలో ఒకపక్క ఈ కేసులో ఉన్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ దర్యాప్తు పైన, సిబిఐ విచారణ పైన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనను అరెస్టు చేస్తారని భయాందోళనలో ఉన్నారు. కోర్టులను ఆశ్రయించి ఈడీ, సిబిఐ దర్యాప్తు అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే రేగా కాంతారావు మాత్రం ఈడీ బోడీ మోడీ లకు ఎవరు భయపడబోమని సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+