ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా: ఎమ్మెల్యే శంకర్ నాయక్ షాకింగ్ వ్యాఖ్యలు
మహబూబాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆయన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి.
వైయస్ షర్మిల తనను విమర్శిస్తే ప్రజలే అడ్డుకున్నారని, తాను సైగ చేస్తే సినిమా వేరేలా ఉండేదని ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యాఖ్యలు చేశారు. తన గురించి ఎవరైనా ఎక్కువ మాట్లాడితే సహించేది లేదని ప్రతిపక్ష నేతలను ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతానికి వచ్చే వలస పక్షులకు వార్నింగ్ ఇచ్చిన ఆయన వలస పక్షుల్లారా ఖబడ్దార్.. ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నాలుక కోస్తానని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

తాను కేవలం ప్రజల వైపు చూస్తే చాలు వైయస్ షర్మిలను అడ్డుకున్నారని, ఇక సైగ చేస్తే సినిమా వేరేలా ఉండేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేర్కొన్నారు. మరోమారు వైయస్ షర్మిల పేరు ప్రస్తావనకు తెచ్చి మరీ శంకర్ నాయక్ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తన గురించి మాట్లాడే వారు ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ ఆయన హితవు పలికారు. శంకర్ నాయక్ ను తిడితే మిమ్మల్ని తిట్టినట్టు కాదా అంటూ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజలు అలా భావించే షర్మిలను అడ్డుకున్నారని తనపై ఆరోపణలు చేసే వారు ఎవరైనా సరే దమ్ముంటే మహబూబాబాద్ లో చర్చకు రావాలని శంకర్ నాయక్ సవాల్ విసిరారు.

దీంతో శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. కాగా బీఆర్ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక మంత్రి ముందే ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ వ్యాఖ్యలు చేయడం, ప్రతిపక్షాలకు హెచ్చరికలు జారీ చెయ్యటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications