అభివృద్ధిపై ఫ్రస్ట్రేషన్ లో నిజాలు చెప్పిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఉన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి తన వల్లే అని చెప్పుకుంటున్నారని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఈ ఆగ్రహంతో ఆయన నిజాలు మాట్లాడేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఎవరి వల్ల జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అన్న అంశాలపై ఆయన ప్రజలు ఆలోచించేలాగా నిజాలనే మాట్లాడారు.

తాటికొండ రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి
తాటికొండ రాజయ్య.. గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసి, అవినీతి ఆరోపణలతో బర్తరఫ్ అయిన మంత్రి. తెలంగాణ రాష్ట్రానికి తొలి డిప్యూటీ సీఎంగా పనిచేసిన తాటికొండ రాజయ్య ప్రస్తుతం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి మొదటినుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకే నియోజకవర్గం పై ఆధిపత్యం కోసం ఇద్దరు నాయకులు నేనంటే నేనంటే పోటీ పడడం ప్రధానంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో కనిపిస్తుంది.

నియోజకవర్గ అభివృద్ధిపై కడియం శ్రీహరి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్
వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొత్తేమీ కాదు. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకోవడం, తిట్టి పోసుకోవడం షరా మామూలే.. అనేకమార్లు వీరిద్దరు పంచాయితీ తెలంగాణ సీఎం కేసీఆర్ దాకా చేరింది. మంత్రి కేటీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకొని నియోజకవర్గ పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేశారు కానీ ఫలితం లేకపోయింది.
నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఇద్దరు నేతలు తిట్టుకోవడం పరిపాటిగా మారింది. ఇక తాజాగా కడియం శ్రీహరి పై విపరీతమైన కోపంతో ఉన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నియోజకవర్గ అభివృద్ధి పై కడియం శ్రీహరి చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ వేస్తూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

అభివృద్ధి విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య
నియోజకవర్గ అభివృద్ధికి తాను తన ఇంట్లోని నిధులను ఖర్చు పెట్టడం లేదని ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన డబ్బునే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామని తాటికొండ రాజయ్య వెల్లడించారు. అభివృద్ధి పథకాలు కేసీఆర్ అందిస్తూ ఉంటే తాను ప్రజలకు పంచి పెడుతున్నానని వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని తాను చేస్తున్న అభివృద్ధిగా ఖాతాలో వేసుకోవడం మూర్ఖత్వమని రాజయ్య వ్యాఖ్యానించారు. కొందరు నాయకులను ప్రజలు మర్చిపోతే గాయిగాయి అవుతున్నారని, పార్టీలో ఉండి ఆ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిని టార్గెట్ చేసి విమర్శించారు.

ప్రజలు కట్టే పన్నుల వల్లే అభివృద్ధి : ఫ్రస్ట్రేషన్ లో నిజం చెప్పిన తాటికొండ రాజయ్య
ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో నియోజకవర్గ అభివృద్ధికి తాము తమ ఇంట్లో నుంచి డబ్బులు ఖర్చు పెట్టడం లేదని, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులనే ఖర్చు చేస్తున్నామని తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఒక పక్క బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నది సీఎం కేసీఆర్ అని, కెసిఆర్ వల్లే ఇంత ప్రగతి సాధ్యమైందని చెబుతుంటే, తాటికొండ రాజయ్య మాత్రం ప్రజలు కట్టిన పన్నుల వల్లే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి ఫ్రస్టేషన్లో అయినా ఎమ్మెల్యే నిజం మాట్లాడారని స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు చేసేదేమీ లేదని, తాము ఇచ్చిన డబ్బు లోనే తమ కోసం ఖర్చు చేసి, ఎంతో చేసినట్టుగా చెప్పుకుంటారని.. తాజాగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో చర్చిస్తున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications