'టీ' కల సాకారం: కాలినడకన తిరుపతికి ఎమ్మెల్యే

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కాలె యాదయ్య తిరుపతికి కాలినడకన వెళుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కాలినడకన తిరుపతికి వస్తానని ఆయన మొక్కుకున్నాడంట.

దీంతో సోమవారం ఆయన తన స్వగ్రామమైన నవాబ్‌పేట మండలం చింతల పేట నుంచి తిరుపతికి కాలినడకన బయలుదేరారు. మంగళవారం చేవెళ్లకు చేరుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య కేసీఆర్ అధ్వర్యంలో బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Mla Yadaiah starts foot journey to tirupati

వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు. చేవెళ్ల చేరుకున్న ఆయనకు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఈ పాదయాత్రకు స్వాగతం పలికారు.

మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాలె యాదయ్య కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత నవంబర్‌లో యాదయ్య కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+