వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేల ఎరకేసు: నేడు సిట్ ముందుకు న్యాయవాది శ్రీనివాస్; ఆ అకౌంట్స్ డీటెయిల్స్ ఇస్తారా?

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా సిట్ అధికారులు చేతికి ఫోరెన్సిక్ నివేదిక చేరడంతో మరోమారు సిట్ అధికారులు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే కోర్టు నిందితులను పదేపదే కస్టడీకి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఇక మరోవైపు బీఎల్ సంతోష్ విచారణకు హారుకావాలని ఈ మెయిల్ పంపించారు. తుషార్, జగ్గూస్వామీ ల విచారణ కోసం కూడా నోటీసులు పంపించారు కానీ వారి నుండి ఇంకా య్యే స్పందన లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే విచారణ జరిపిన బండి సంజయ్ కు బంధువైన న్యాయవాది శ్రీనివాస్ కు సిట్ మళ్లీ నోటీసులు జారీ చేసింది. దీంతో నేడు శ్రీనివాస్ మళ్ళీ సిట్ అధికారుల విచారణకు హాజరు కానున్నారు.

ఎమ్మెల్యేల ఎరకేసు: సిట్‌ చేతికి ఫోరెన్సిక్‌ నివేదిక.. రామచంద్రభారతిపై నకిలీ పాస్ పోర్ట్ కేసు!!ఎమ్మెల్యేల ఎరకేసు: సిట్‌ చేతికి ఫోరెన్సిక్‌ నివేదిక.. రామచంద్రభారతిపై నకిలీ పాస్ పోర్ట్ కేసు!!

మళ్ళీ శ్రీనివాస్ విచారణకు సిట్ నోటీసులు

మళ్ళీ శ్రీనివాస్ విచారణకు సిట్ నోటీసులు


ఇప్పటికే రెండు రోజుల పాటు న్యాయవాది శ్రీనివాస్ ను విచారణ జరిపిన సిట్ నందకుమార్ , సింహయాజి తో కలిసి శ్రీనివాస్ ఎక్కడ ఎక్కడ ప్రయాణం చేశారు అన్న వివరాలు చెప్పాలని సిట్ న్యాయవాది శ్రీనివాస్ కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు నందకుమార్ వద్ద శ్రీనివాస్ 55 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నానని చెప్పినట్టు, నంద్ కుమార్ కు నెలకు ఒక లక్షా పదివేల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నట్లు శ్రీనివాస్ గత విచారణలో చెప్పారని, దానికి సంబంధించిన గూగుల్ పే, ఫోన్ పే వివరాలు, అకౌంట్ డీటెయిల్స్ సమర్పించాలని సిట్ తన నోటీసులో పేర్కొంది.

నేడు సిట్ ముందుకు శ్రీనివాస్... పలు కీలక వివరాలపై సిట్ ఆరా

నేడు సిట్ ముందుకు శ్రీనివాస్... పలు కీలక వివరాలపై సిట్ ఆరా


ఇక నేడు శ్రీనివాస్ విచారణ కొనసాగనున్న నేపథ్యంలో పలు కీలక విషయాలపై న్యాయవాది శ్రీనివాస్ సమాధానాలు కావాలని నోటీసులో పేర్కొన్న సిట్ నందకుమార్ కు బుక్ చేసిన విమాన టికెట్లు వివరాలు ఇవ్వాలని పేర్కొంది. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్టు శ్రీనివాస్ సిట్ అధికారులకు చెప్పడంతో తో పాటు సిట్ కు అప్పగించిన మొబైల్ ఫోన్ లో ట్రావెల్ ఏజెన్సీ వివరాలు ఉన్నట్టు శ్రీనివాస్ వెల్లడించారు. అయినప్పటికి మరోమారు విచారణ కు వచ్చేటప్పుడు పలు వివరాలను తీసుకురావాలని సిట్ నోటీసులో పేర్కొంది.

 శ్రీనివాస్ పాత ఫోన్ ఇవ్వాలన్న సిట్ .. ఫోన్ పగిలిపోయిందన్న శ్రీనివాస్

శ్రీనివాస్ పాత ఫోన్ ఇవ్వాలన్న సిట్ .. ఫోన్ పగిలిపోయిందన్న శ్రీనివాస్


ఎమ్మెల్యేలకు ఎర కేసులో శ్రీనివాస్ ఈనెల 21, 22 వ తేదీన సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. 21వ తేదీన విచారణకు హాజరైన శ్రీనివాస్ తాను ఉపయోగిస్తున్న శాంసంగ్ ఫోన్ ను అధికారులకు అప్పగించారు. అయితే జూలై వరకు ఉపయోగించిన మరొక ఫోనును తమకు అప్పగించాలని శ్రీనివాస్ కు సిట్ స్పష్టం చేసింది. తమ పాత ఫోన్ పగిలిపోయిన కారణంగా తాను కొత్త ఫోన్ కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నట్లు శ్రీనివాస్ సిట్ అధికారులకు చెప్పారు. ఇక శ్రీనివాస్, శ్రీనివాస్ భార్య బ్యాంక్ ఖాతాల వివరాలు, పాస్ పోర్టులు ఇవ్వాలని సిట్ అధికారులు శ్రీనివాస్ కు సూచించారు. మరి నేడు మరోమారు సిట్ అధికారుల ముందుకు శ్రీనివాస్ రానున్న నేపథ్యంలో ఆయన ఏ వివరాలు అధికారులకు ఇస్తారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు ఎలా సాగబోతుంది అన్నది తెలియాల్సి ఉంది.

English summary
Lawyer Srinivas will appear before the SIT today in the case of MLAs. Srinivas to give the bank details as it is stated in the SIT notice that the account details regarding the financial transactions with Nandakumar are required.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X