ఎమ్మెల్యేల ఎరకేసులో కీలక మలుపు.. సిట్ నోటీసులపై బీఎల్ సంతోష్ స్పందన ఇలా!!
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ పంపించిన నోటీసులకు ఎట్టకేలకు బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ స్పందించారు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. అసలు ఈ కేసులో ఆయన స్పందిస్తారా? ఏ చెయ్యబోతున్నారు అని అంతా ఉత్కంఠగా చూస్తున్న వేళ ఆయన తన చర్యతో ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.

బీఎల్ సంతోష్ కు నోటీసులతో కేసులో తాజా ట్విస్ట్
ఢిల్లీకి చెందిన బీజేపీ కీలక నేత అయిన బీఎల్ సంతోష్ కు ఈ కేసులో పాత్ర ఉందని సిట్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. నిందితుల వద్ద ఉన్న ల్యాప్ ట్యాప్లు, మొబైల్ ఫోన్ కాల్ డేటా, వాట్సప్ సమాచారం ఆధారంగా బీఎల్ సంతోష్, తుషార్, జగ్గూ స్వామిలకు నోటీసులు పంపించారు. గత కొద్ది రోజులుగా బి ఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ ఆయన ఈ వ్యవహారంపై స్పందించకపోవడంతో తెలంగాణ సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. వారిని అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే తెలంగాణ హైకోర్టు మరోమారు నోటీసులను మెయిల్ చేయాలని సూచించడంతో మరోమారు 41 ఏ క్రింద నోటీసులను బి ఎల్ సంతోష్ కు మెయిల్ చేశారు. దీంతో తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

తెలంగాణా హైకోర్టులో సిట్ నోటీసులను సవాల్ చేసిన బీఎల్ సంతోష్
ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులుబీజేపీ కీలక నేత బి యల్ సంతోష్,తుషార్,జగ్గు స్వామి, శ్రీనివాస్లను నిందితులుగా చేర్చి లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈనెల 29వ తేదీన విచారణ కు రావాలని ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు సిట్నోటీసులు జారీ చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకుబి ఎల్ సంతోష్ 41 ఏ నోటీసులు జారీ చేసినసిట్ఆ నోటీసులను ఆయనకుమెయిల్ చేసింది.ఈనెల 26వ తేదీన కానీ 28న గానీ సంతోష్ విచారణకు రావాలని సిట్ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా బి ఎల్ సంతోష్ సిట్ పంపించిన నోటీసులను తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు.

క్వాష్ పిటీషన్ వేసిన బీఎల్ సంతోష్ .. ఏం జరుగుతుందో?
తెలంగాణ హైకోర్టులో తనకు పంపించిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ ఆయన నేడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులో సిట్ తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని ఆయన కోర్టుకి విజ్ఞప్తి చేశారు. తనకు నోటీసులను ఇవ్వడం చట్టవిరుద్ధమని బిఎల్ సంతోష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై కోర్టు విచారణ జరుపుతుందా? ఏం నిర్ణయం వెల్లడిస్తుంది? అన్నది ప్రస్తుత ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ అధికారులు నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామి లను ప్రధాన నిందితులుగా పేర్కొనగా ఏ4 గా బి ఎల్ సంతోష్, ఏ5గా హుషార్, ఏ6 గా జగ్గూ స్వామి, ఏ7 గా అడ్వకేట్ శ్రీనివాస్ ల పేర్లను జాబితాలో చేర్చింది. ఇక ఇతర రాష్ట్రాల నిందితులు కూడా స్పందిస్తున్న క్రమంలో ఈ కేసుపై అందరి దృష్టి నెలకొంది.












Click it and Unblock the Notifications