ఎమ్మెల్యేల ఎరకేసు.. సిట్ విచారణకు నందకుమార్ భార్య చిత్రలేఖ, అడ్వకేట్ ప్రతాప్ గౌడ్; ఉత్కంఠ!!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈరోజు మరోమారు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే బండి సంజయ్ బంధువైన అడ్వకేట్ శ్రీనివాస్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో నేడు శ్రీనివాస్ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఇదే సమయంలో నందకుమార్ భార్య చిత్రలేఖకు, ఈ వ్యవహారంలో అంబర్ పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు సిట్ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో నేడు ప్రతాప్ గౌడ్, నందకుమార్ సతీమణి చిత్రలేఖను సిట్ విచారణ చెయ్యనుంది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులతో సంబంధాలపై ప్రతాప్ గౌడ్ కు సిట్ విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులతో సంబంధాలపై ప్రతాప్ గౌడ్ కు సిట్ విచారణ

న్యాయవాది ప్రతాప్ గౌడ్ నందకుమార్ తో పలు లావాదేవీలు నిర్వహించడంతో పాటు, సింహయాజీ స్వామీజీతో అనేక సందర్భాలలో కలిసి ప్రయాణం చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులతో న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు ఉన్న సంబంధాలను, వారి మధ్య జరిగిన లావాదేవీలను మరింత లోతుగా దర్యాప్తు చేయడం కోసం సిట్ అధికారులు ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ప్రతాప్ గౌడ్ హై హైకోర్టుకు వెళ్లారు.

 నేడు సిట్ ముందుకు ప్రతాప్ గౌడ్

నేడు సిట్ ముందుకు ప్రతాప్ గౌడ్


సింహయాజీ స్వామీజీతో కలిసి కేవలం పూజలు చేయించుకున్న అంతమాత్రాన తనకు నిందితులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. తనకు సిట్అధికారులు ఇచ్చిన నోటీసును కొట్టివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో హైకోర్టు విచారణకు హాజరు కావాలని, దర్యాప్తుకు సహకరించాలని, అయితే ప్రతాప్ గౌడ్ ను అరెస్టు చేయకూడదని ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలోనే నేడు సిట్ అధికారుల ముందు ప్రతాప్ గౌడ్ విచారణకు హాజరు కానున్నారు.

నందకుమార్ సతీమణి చిత్రలేఖ విచారణ నేడే.. ఆ లావాదేవీలపై విచారణ

నందకుమార్ సతీమణి చిత్రలేఖ విచారణ నేడే.. ఆ లావాదేవీలపై విచారణ


ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి నందకుమార్ సతీమణి చిత్రలేఖను సిట్ బృందం విచారించనుంది. నందకుమార్ కు సంబంధించిన వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకోవడం కోసం ఆయన భార్య చిత్రలేఖను ఈరోజు సిట్ అధికారులు విచారించనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితునిగా ఉన్న నందకుమార్ అనేక లావాదేవీలను భార్య చిత్రలేఖ ఖాతా నుండి కూడా చేసినట్టుగా గుర్తించడంతో సిట్ అధికారులు చిత్రలేఖను విచారించనున్నారు. నేడు అడ్వకేట్ ప్రతాప్ గౌడ్, నందకుమార్ సతీమణి చిత్ర లేఖ, అడ్వకేట్ శ్రీనివాస్ లను విచారించనున్న క్రమంలో ఈ కేసులో మరెన్ని విషయాలు బయటకు వస్తాయో అన్న ఉత్కంఠ కొనసాగుతుంది.

ఎమ్మెల్యేల ఎరకేసులో కీలక పరిణామాలు

ఎమ్మెల్యేల ఎరకేసులో కీలక పరిణామాలు


ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు బీజేపీ కీలక నేత బి యల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాస్ లను నిందితులుగా చేర్చి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈనెల 29వ తేదీన విచారణ కు రావాలని ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు సిట్ నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు బి ఎల్ సంతోష్ 41 ఏ నోటీసులు జారీ చేసిన సిట్ ఆ నోటీసులను ఆయనకు మెయిల్ చేసింది. ఈనెల 26వ తేదీన కానీ 28న గానీ సంతోష్ విచారణకు రావాలని సిట్ ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+