తెలంగాణాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ ... కేసీఆర్ కు హుజురాబాద్ ఎఫెక్ట్ !!
హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ రాజీనామా చేయడం టీఆర్ఎస్ పార్టీకి కొత్త కష్టాలు తెచ్చిపెట్టిందా ? హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కూడా అధికార పార్టీని ఇబ్బంది పెడుతుందా? అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రాజీనామాల డిమాండ్ వినిపిస్తుందా ? ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే సీఎం కేసీఆర్ అభివృద్ధిపై దృష్టి సారిస్తానని ప్రజలు భావిస్తున్నారా ? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది.

హుజురాబాద్ లో తాజా అభివృద్ధి రాజీనామా వల్లే .. టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షం
హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ సమయంలో హుజురాబాద్ కు నిధుల వరద పారింది. అభివృద్ధి పనులలో హుజురాబాద్ దూకుడు చూపిస్తుంది. హుజురాబాద్ నియోజకవర్గానికి తన వల్లే అభివృద్ధి జరుగుతుందని, తన రాజీనామా వల్లనే అభివృద్ధి చేస్తున్నారని ఈటెల రాజేందర్ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక వైయస్ షర్మిల, విజయశాంతి వంటి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా మీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని పెద్ద ఎత్తున తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయి. ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది అంటూ షర్మిల,విజయశాంతి ప్రజలను ఆలోచింపజేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ .. భూపాలపల్లి ఎమ్మెల్యేకు రాజీనామా డిమాండ్
హుజురాబాద్ లో తాజా పరిణామాల నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గం గండ్ర వెంకటరమణా రెడ్డి హయాంలో అభివృద్ధి చెందడం లేదని రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తుంది. ఈటల రాజేందర్ ను చూసి నేర్చుకోవాలని రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళితే అయినా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు . రమణా... రాజీనామా చెయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు .

వరంగల్ తూర్పు ఎమ్మెల్యేకు తప్పని తిప్పలు
గండ్ర వెంకటరమణా రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి భూపాలపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి, అప్పుడు తెలంగాణ స్పీకర్ గా పనిచేసిన సిరికొండ మధుసూదనా చారి మీద విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ ఫిరాయించి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా ఉందని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా డిమాండ్
ఇటీవల బిజెపి నాయకులు గుంతల మయం అయిన రోడ్లపై పువ్వులు చల్లి, గుంతలకు పుష్పాభిషేకం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తే అయినా సీఎం కేసీఆర్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తానని ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇదే సమయంలో నల్గొండ జిల్లాలోనూ రాజీనామా కోసం డిమాండ్ పెద్దఎత్తున వినిపిస్తోంది.

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పైనా నిరసన .. రాజీనామా డిమాండ్
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రాజీనామా చేస్తే నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి అవుతుందని డిమాండ్ వినిపిస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఈటల రాజేందర్ రాజీనామాతో సీఎం కేసీఆర్ ఎలాగైతే అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా నల్గొండ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పుడు వరకు కనీసం నల్గొండ వైపు కూడా చూడలేదని, ఈ రెండేళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు.

హుజురాబాద్ ఎఫెక్ట్ .. అభివృద్ధి జరగని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కొత్త కష్టాలు
బాధ్యతగల ఎమ్మెల్యేగా అభివృద్ధి కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అనేక నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఫిరాయింపు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇక హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ రాజీనామాతో మొదలైన రగడ, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై రాజీనామాల అస్త్రంతో హాట్ టాపిక్ గా మారింది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications