MLC Election Results 2021: కారు జోరు -పల్లా, వాణిదేవికే తొలి ప్రాధాన్యం -తాజా ఫలితాలివే..

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిదానంగా కొనసాగుతోంది. వరంగల్‌ - ఖమ్మం -నల్లగొండ స్థానంతోపాటు హైదరాబాద్‌ -రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్‌ అధిక్యంలో దూసుకెళుతుంది. మొదటి, రెండో, మూడో ప్రాధాన్యత ఓట్ల క్రమంలో లెక్కింపు కొనసాగుతున్నందున తుది ఫలితాలు రావడానికి సమయం పడుతుందని, శనివారం నాటికి పూర్తి స్థాయి రిజల్ట్స్ రావొచ్చని అధికారులు చెబుతున్నారు. తాజా ఆధిక్యాల విషయానికొస్తే..

నల్గొండలో ‘తొలి’ పూర్తి

నల్గొండలో ‘తొలి’ పూర్తి

వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తయింది. తొలి ప్రాధాన్యతలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 27,550 ఓట్ల ఆధిక్యం సాధించారు. పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,10,840రాగా, సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు దక్కాయి. టీజేఏస్ క్యాండిడేట్ కోదండరాం 70,072ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 39,107 ఓట్లు పొందారు.

పల్లా గెలవాలంటే ఇంకా..

పల్లా గెలవాలంటే ఇంకా..

తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుపై అధికారిక లెక్కల ప్రకారం, మొత్తం ఓట్లు 3,87,969కాగా, 3,66,333ఓట్లు చెల్లుబాటయ్యాయి. 21,636ఓట్లు మురిగిపోయాయి. శుక్రవారం ఉదయం నాటికే నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందలంటే ఇంకా 72,327 ఓట్లను సాధించాల్సి ఉంటుంది. అదే తీన్మార్ మల్లన్న గెలుపొందలంటే కావలసిన ఓట్లు 99,877. ప్రొఫెసర్ కోదండరామ్ గెలవాలంటే 1,13,095 కావాల్సి ఉంటుంది. మరోవైపు

పీవీ కూతురు లీడింగ్..

పీవీ కూతురు లీడింగ్..


హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం ఆరో రౌండ్ ఫలితాలను అధికారులు ప్రకటించారు. ఆరో రౌండ్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణిదేవి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆరవ రౌండ్ పూర్తి అయ్యే సమయానికి వాణిదేవికి 1,05,710 ఓట్లు, రామచంద్రరావుకు 98,084 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 50,450 ఓట్లు, చిన్నారెడ్డికి 29,627ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి రామచంద్రరావుపై 7,626 ఓట్ల ఆధిక్యతతో వాణీదేవి కొనసాగుతున్నారు. ఈ స్థానంలో ఏడో రౌండుతో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. రెండు స్థానాల్లోనూ ఆధిక్యాలు తక్కువగా ఉన్నందున రెండో ప్రాధాన్యత ఓట్లతో ఫలితం రాకుంటే, మూడో ప్రాధాన్యత ఓట్లనూ లెక్కిస్తారు. మొత్తానికి శనివారం నాడే పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+