ఢిల్లీ ఎఫెక్ట్: అలక వీడిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయ్!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై ఎట్టకేలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక వీడారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను తనకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీని వీడతారని కూడా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. జీవన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్షణ్, ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, ప్రేమసాగర్ రావు తదితరులు బుజ్జగించే ప్రయత్నం చేశారు.

అయినా ఆయన మెట్టు దిగలేదు. తన ప్రమేయం లేకుండా పార్టీ మార్పు జరిగిందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నప్పటికీ.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. బుధవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ ఢిల్లీ వెళ్లారు. ఆ వెంటనే భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులతో మాట్లాడిన తర్వాత జీవన్ రెడ్డిని ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అక్కడ పార్టీ పెద్దలైన కేసీ వేణుగోపాల్‌తో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు.
Jeevan Reddy met T-Congress Affairs Incharge Deepadas Munshi and Minister Sridhar Babu in Delhi.#JeevanReddy #SridharBabu
— Team Congress (@TeamCongressINC) June 26, 2024
• @jeevanreddyMLC
• @OffDSB
• @DeepaDasmunsi pic.twitter.com/nXhevRjERs
కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మనసు మార్చుకున్నారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, పార్టీ ముఖ్యమని వ్యాఖ్యానించారు. రాజకీయ పరిణామాలు, పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాలు తప్పవని ఆయన చెప్పారు.
మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారని, కార్యకర్తలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యమని, లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలుచేస్తోందని, బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ముఖ్య నేత అని దీపాదాస్ మున్షీ అన్నారు. అంతేగాక, ఇతర పార్టీల నుంచి వచ్చేవారి కోసం కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications