వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఎనిమిదేళ్ళ పాలనపై సూటిగా.. సుత్తిలేకుండా; ఎమ్మెల్సీ కవిత ఎనిమిది ప్రశ్నలు!!

|
Google Oneindia TeluguNews

భారతదేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి ఉంటే ప్రధాని నరేంద్ర మోడీకి ఎనిమిది సంవత్సరాలలో, ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎనిమిది ప్రశ్నలను సంధించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

దేశాన్ని అన్ని రంగాల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీ దిగజార్చారు: కవిత

దేశాన్ని అన్ని రంగాల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీ దిగజార్చారు: కవిత

8 ఏళ్ల పాలనలో మోడీ దేశానికి చేసిందేమీ లేదని కవిత తేల్చిచెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీ దిగజార్చారని కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ పట్ల వివక్ష ఎప్పటికి అంతం అవుతుందని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కె.కవిత ప్రశ్నించారు. రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న రూ.7,000 కోట్ల బకాయిలను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ఎనిమిదేళ్ళు ప్రజలు బేజారు.. అనేక ప్రశ్నలను సంధించిన కవిత

ఎనిమిదేళ్ళు ప్రజలు బేజారు.. అనేక ప్రశ్నలను సంధించిన కవిత

ఇక ఎమ్మెల్సీ కవిత ప్రధాని నరేంద్ర మోడీకి సంధించిన ఎనిమిది ప్రశ్నలను చూస్తే ఎనిమిది సంవత్సరాలు ప్రజలు బేజారు అయ్యారని పేర్కొన్న కవిత నారీ శక్తికి సమాన స్థానం కల్పించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడుంది మోడీ జీ? అంటూ ఆమె ప్రశ్నించారు. దేశ జిడిపి పడిపోతున్నప్పుడు, మరో జిడిపి పెరుగుతుందని - గ్యాస్-డీజిల్-పెట్రోల్ ధరల పెరుగుదలను టార్గెట్ చేసిన కవిత ఈ విపరీతమైన పెరుగుదల నుండి వచ్చిన డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టారో తెలుసుకోవాలనుకుంది అంటూ ప్రశ్నించారు.

ప్రజలకు నిజమైన అమృత కాలం ఎప్పుడొస్తుంది

ప్రజలకు నిజమైన అమృత కాలం ఎప్పుడొస్తుంది

ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకోవడంతో, దేశ ప్రజలు ధరల నుంచి విముక్తి కలిగించే భారత్ యొక్క 'అచ్చే దిన్'ని ఎప్పుడు చూస్తారని ఆమె మోడీ సర్కార్ ను టార్గెట్ చేశారు. విఫలమైన లా అండ్ ఆర్డర్, విఫలమైన వ్యవస్థలతో, భారత ప్రజలకు నిజమైన 'అమృత్ కాలం ' ఎప్పుడు వస్తుందని కవిత ప్రశ్నించారు. రైతులు భారతదేశానికి గుండె చప్పుడు అని, కానీ నేడు తెలంగాణలోని వరి రైతులు, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపు ఇవ్వకుండా బిజెపి చేతిలో నష్టపోతున్నారని కవిత ఆరోపించారు.

పిఎం కేర్స్ ఫండ్స్ లెక్కలు ఇప్పటికైనా చెప్తారా ?

పిఎం కేర్స్ ఫండ్స్ లెక్కలు ఇప్పటికైనా చెప్తారా ?

న్యూ ఇండియా పేరిట మోడీ సర్కార్ ఉపాధికి పాతర వేసిందని, ఫలితంగా కోట్లాది మంది భారతీయుల జీవనోపాధికి సరిపడా జనాలకు అందించే ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చివరిగా పి ఎం కేర్స్ ఫండ్స్ యొక్క నిజం మరియు జవాబుదారీతనం గురించి ప్రధానమంత్రి నిజంగా దేశానికి చెప్పే రోజు వస్తుందా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మోడీ హయాంలో గత ఎనిమిదేళ్లు 'నిస్సహాయ' భారతదేశంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

English summary
The MLC Kavitha on Modi’s eight-year rule raises eight questions. Demanded that Modi to answer her questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X