లిక్కర్ క్వీన్ పేరు 28సార్లు.. రాజగోపాల్ అన్న.. మాట జారకు: ఎమ్మెల్సీ కవిత క్లారిటీ!!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పేరు మరో మరో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సిబిఐ అధికారులు ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను సాక్షిగా వివరించారు. మరోమారు సాక్ష్యాల నమోదు చేయడానికి ఎమ్మెల్సీ కవితకు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇక తాజాగా లిక్కర్ స్కాంపై ఈడీ చార్జిషీట్ లో కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత పేరు ఉండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కవితకు నిదానంగా ఉచ్చు బిగుస్తుందన్న చర్చ జరుగుతుంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు బిగుస్తున్న ఉచ్చు
ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత కీలకంగా ఉన్నారని అనేకమార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ ప్రకటించిన చార్జిషీట్ లో కవిత పేరు ఇరవై ఎనిమిది సార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సమీర్ మహేంద్రుపై నమోదు చేసిన 181 పేజీల చార్జిషీట్లో ఇరవై ఎనిమిది సార్లు కవిత పేరును ప్రస్తావించిన ఈడీ అధికారులు కవితతో కలిసి సమీర్ మహేంద్ర మద్యం వ్యాపారం చేసే వారిని వెల్లడించింది.
ఈడీ చార్జ్ షీట్ లో కవిత పేరు.. సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్ లో కవితకు వాటాలు
ఇండో స్పిరిట్స్ కు ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ చార్జిషీట్ లో అభియోగం మోపింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ కు 100 కోట్లు ఇవ్వడంతో కీలక భూమిక పోషించిన నేపద్యంలో ఢిల్లీ మద్యం వ్యాపారంలో సమీర్ మహేంద్రు నడిపిస్తున్న ఇండో స్పిరిట్ లో కవితకు వాటాలు దక్కాయని, అయితే కవిత కు బదులు అరుణ పిళ్ళై దీనికి ప్రాతినిధ్యం వహించారని చార్జిషీట్లో పేర్కొన్నారు. ఇక ఈ కుంభకోణం బయటపడడంతో కవిత కు చెందిన రెండు ఫోన్ నెంబర్లు, ఫోన్ ల తో పాటు, బోయినపల్లి అభిషేక్, సృజన్ రెడ్డి, గోరంట్ల బుచ్చి బాబు, శరత్ చంద్ర రెడ్డి కి చెందిన ఫోన్ నెంబర్లను, ఫోన్ లను ధ్వంసం చేశారని ఈడీ చార్జిషీట్ లో పేర్కొంది. ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఉన్నట్టు చార్జ్ షీట్ లో నమోదు కావటంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతల నుండి మరోమారు కవిత టార్గెట్ అవుతున్నారు.
లిక్కర్ క్వీన్ అంటూ టార్గెట్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ..
తాజాగా ట్విట్టర్ వేదికగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత ను టార్గెట్ చేశారు. ఓ పేపర్లో వచ్చిన వార్తా కథనాన్ని పోస్ట్ చేసిన ఆయన చార్జిషీట్‌లో లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ప్రస్తావించబడింది అంటూ పేర్కొన్నారు. కవిత లిక్కర్ క్వీన్ అంటూ ఆయన టార్గెట్ చేశారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చిన ఎమ్మెల్సీ కవిత రాజగోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

అబద్ధం నిజం కాదన్న ఎమ్మెల్సీ కవిత
28 సార్లు నా పేరు చెప్పించినా, 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు అంటూ సమాధానమిచ్చారు కవిత. మొత్తానికి ఎమ్మెల్సీ కవిత మరోమారు ఈడీ చార్జిషీట్ నేపధ్యంలో ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ వ్యవహారంపై ముందు ముందు తెలంగాణ రాష్ట్రంలో మరెంత మాటల యుద్ధం కొనసాగుతుందో వేచి చూడాలి.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications