MLC Kavitha సీబీఐ కస్టడీ తొలిరోజు.. అప్రూవర్ల వాంగ్మూలాలు, కీలక సాక్ష్యాలను ముందుంచి..!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను నేటి నుండి మూడు రోజులపాటు సిబిఐ విచారణ చేయనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ కవితను అరెస్టు చేసి, కోర్టు ఆదేశాలతో పది రోజులపాటు విచారించింది. ఆపై కవితకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో కవిత తీహార్ జైలులో ఉంది. అయితే కవిత మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో, లిక్కర్ కుంభకోణంలో కవితను విచారించాలని సిబిఐ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది.
నేడు కవిత సీబీఐ తొలిరోజు విచారణ
కోర్టు అనుమతితో కవితను విచారించడానికి రంగంలోకి దిగిన సిబీఐ కవితను అరెస్టు చేసింది. ఆపై తాజాగా కోర్టు ఆదేశాలతో కవితను నేటి నుండి కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. నేడు తొలి రోజు సిబిఐ కవితను విచారించనుంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బుచ్చిబాబు కవిత మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించిన అనేక సాక్షాలను కవిత ముందు పెట్టి సిబిఐ అధికారులు విచారించనున్నారు.

వారి వాంగ్మూలాల ఆధారంగా కవిత విచారణ
ఈ కేసులో అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, దినేష్ అరోరా, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి తో పాటు అశోక్ కౌశిక్ వాంగ్మూలాలను చూపించి సిబిఐ అధికారులు కవితను విచారించనున్నారు. ఢిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్ నేతలకు 100కోట్ల ముడుపులు ముందుగానే చెల్లించి తర్వాత ఆ డబ్బు కోసం అరబిందో గ్రూప్ కి చెందిన శరత్ చంద్రారెడ్డి పై ఒత్తిడి చేసినట్టు సమాచారం.
సేకరించిన సాక్ష్యాలకు కవిత సమాధానాలకు పొంతన లేకనే
అంతేకాకుండా ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిని కవిత బెదిరించినట్లు గా కూడా సమాచారం. ఈ కేసులో ప్రధాన కుట్రదారులలో ఆమె ఒకరిగా, పలువురి వాంగ్మూలాల ద్వారా తేలిందని సిబిఐ అధికారులు చెబుతున్నారు. దర్యాప్తులో సేకరించిన సాక్షాధారాలు ఆమె సమాధానాలు భిన్నంగా ఉన్నాయని, కస్టడీకి ఇస్తే ఆమెను మరింత విచారించే అవకాశం ఉందని సిబిఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో, కోర్టు కవితను మూడు రోజులపాటు సిబిఐ కస్టడీకి ఇచ్చింది.
కవిత సీబీఐ కస్టడీ విషయంలో కోర్టు ఆదేశాలు
అయితే సిబిఐ కస్టడీలో ఉండే కవితను ప్రతిరోజు సాయంత్రం 6గంటల నుండి 7 గంటల మధ్య అడ్వకేట్ మోహిత్ రావుతో ఓ అరగంట సేపు మాట్లాడడానికి, అలాగే ఆమె సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, ఆమె పీఏ శరత్ తో 15నిమిషాల పాటు మాట్లాడడానికి వీలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. నిందితురాలిని ప్రశ్నించే సమయంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేసి దాని ఫుటేజ్ ను కూడా భద్రం చేయాలని కోర్టు ఆదేశించడంతో కోర్టు ఆదేశాలతోనే కవితను విచారించనున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications