నేడు చెన్నైకి కవిత: తమిళనాట కాలిడుతున్న కేసీఆర్ బిడ్డ.. లక్ష్యం అదే!!

ఎమ్మెల్సీ కవిత తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. నేడు కవిత చెన్నైలో ఓ సదస్సులో పాల్గొననున్నారు.

బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ ప్రతి రాష్ట్రంలోనూ వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఏ చిన్న అవకాశం దొరికినా బీఆర్ఎస్ ను ప్రచారంలోకి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో తాజాగా నేడు ఎమ్మెల్సీ కవిత తమిళనాట అడుగుపెట్టనున్నారు. నేడు చెన్నైలో జరగనున్న ఒక చర్చ వేదికలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బీఆర్ఎస్ అజెండాను అందరికీ తెలియజేయడమే లక్ష్యంగా కవిత నేడు చెన్నైలో జరగనున్న చర్చావేదికలో మాట్లాడనున్నారు.

తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న బీఆర్ఎస్

తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న బీఆర్ఎస్

ఇప్పటికే తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన కేసీఆర్,సరిహద్దు రాష్ట్రాలలో తెలుగు వారికి పట్టున్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు.2024 ఎన్నికలే లక్ష్యంగా అన్ని రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న కెసిఆర్ ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ, నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ చేరికల సభ ద్వారా తన సత్తా చాటే ప్రయత్నం చేశారు. నిదానంగా వివిధ రాష్ట్రాలలో పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ తమిళనాడు రాజకీయాలపై కూడా ఫోకస్ చేస్తున్నారు.

చెన్నైలో పర్యటించనున్న కవిత

చెన్నైలో పర్యటించనున్న కవిత


ఇక ఇదే క్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో పర్యటించనున్నారు. ఒక ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న 2024 ఎన్నికలు ఎవరు విజయం సాధిస్తారు అనే అంశంపై జరిగే చర్చలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ముందుగా నటుడు అర్జున్ చెన్నైలో నిర్మించిన ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే కవిత, అనంతరం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహిస్తున్న కార్యక్రమమైన 2024 ఎన్నికలు.. ఎవరు విజయం సాధిస్తారు అనే అంశంపై జరిగే చర్చ వేదికలో తన గళాన్ని వినిపించనున్నారు.

చర్చా వేదికలో పాల్గొననున్న కవిత

చర్చా వేదికలో పాల్గొననున్న కవిత


ఈ చర్చావేదికలో ఎమ్మెల్సీ కవితతో పాటు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసన్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కూడా పాల్గొంటారు. ఈ సదస్సు వేదికగా బీఆర్ఎస్ పార్టీ అజెండా, ముందు ముందు జాతీయ రాజకీయాలలో బీఆర్ఎస్ పోషించనున్న పాత్ర,దేశ అభివృద్ధికి కెసిఆర్ ఆలోచనలు, దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి కవిత మాట్లాడనున్నారు.

బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్న కవిత

బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్న కవిత


తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కూడా ఎమ్మెల్సీ కవిత మాట్లాడతారు. ఇక ఇదే సమయంలో కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎమ్మెల్సీ కవిత అందరికీ తెలిసేలా చెప్పనున్నారు.తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలోనూ మార్పు తీసుకురావటానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చెయ్యబోతుందో కవిత చెప్పనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+