తెలంగాణ త‌ల వంచ‌దు - సహకరిస్తాను, కానీ : కవిత..!!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసుల పై కవిత స్పందించారు. తానుదర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసుల పై కవిత స్పందించారు. తానుదర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు. తనకు నోటీసులు అందాయన్ని నిర్దారించారు. చట్టాన్ని గౌరవిస్తానని స్పష్టం చేసారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో ధర్నాకు ముందే నిర్ణయించామని గుర్తు చేసారు. అదే సమయంలో ముందస్తు అపాయింట్‌మెంట్ల‌ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను అని క‌విత పేర్కొన్నారు. తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని కవిత వ్యాఖ్యానించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే కవిత పలు మార్లు స్పష్టం చేసారు. తాను ఫోన్లు ధ్వంసం చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కవిత తాజాగా ఇచ్చిన ఇంటర్యూల్లోనూ వెల్లడించారు. ఇదే సమయంలో ఈడీ తమ విచారణలో భాగంగా రామచంద్రన్ పిళ్లై ను అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పిళ్లై తాను కవితకు బినామీగా పేర్కొన్నట్లుగా ఈడీ వివరించింది. కవితను రేపు ఢిల్లీకి రావాలని సమన్లు జారీ చేసింది. దీని స్పందించిన కవిత తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని చెప్పారు. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామని స్పష్టం చేసారు.

MLC Kavitha likely to seek more time to attend before ED in Delhi Liquor case investigation, Discussions with leagal Experts

ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలని కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటామన్నారు. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాము అని క‌విత స్ప‌ష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది అని క‌విత తెలిపారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనేది తమ డిమాండ్ గా కవిత వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+