తలవంచం - తెగించి కొట్లాడుతాం: ఎమ్మెల్సీ కవిత..!!
బీఆర్ఎస్ పార్టీ మీద.. మరీ ముఖ్యంగా తన మీద ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు. కెసిఆర్ ఎదుర్కొనే ధైర్యం లేఖ తన మీద దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఫేక్ చాట్ లతో తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు సుఖేశ్ తో ఏలాంటి పరిచయము లేదని స్పష్టం చేసారు. వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా తన మీద ప్రచారం చేయటం పైన ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ బిడ్డలంగా తలవంమని.. తెగించి కొట్లాడుతామని కవిత స్పష్టం చేసారు.

అసలు సుఖేష్ చంద్రశేఖర్ తో పరిచయం లేదని.. కానీ వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయిని కవిత ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో తన మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారని చెప్పుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్‌ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని కవిత పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారు అని తెలంగాణ సమాజం గ్రహించాలి..జాగ్రత్త పడాలి అని కవిత సూచించారు. కేసీఆర్ మీద కక్షతో, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్శ్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. చైతన్య జీవులని చెప్పిన కవిత.. నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications